అనిరుధ్‌ని మార‌న్ కుటుంబం అల్లుడిని చేసుకోవ‌డానికి అస‌లు కార‌ణం?

అదంతా స‌రే కానీ.. ఈ సినిమా వోడికి.. సంగీతం పేరుతో సినిమాల‌కే అంకిత‌మైన వాడికి దిగ్గ‌జ వ్యాపార‌వేత్త‌, వేల కోట్ల సామ్రాజ్య క‌ర్త‌లు పిలిచి పిల్ల‌నివ్వ‌డ‌మెలా?

Update: 2026-10-18 06:09 GMT

బాగా డ‌బ్బుంటే పెళ్లి అవ్వ‌దు. కుటుంబ నేప‌థ్యం ఈరోజుల్లో చాలా కీల‌కం. కోట్లు ఘ‌డిస్తున్న‌ 40 ప్ల‌స్ బ్ర‌హ్మ‌చారులు ఈరోజుల్లో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు కూడా 35 ప్ల‌స్ లో కోటి పైబ‌డిన‌ వార్షిక ప్యాకేజీలు అందుకుంటూ ఇంకా బ్ర‌హ్మచారిణులుగా వెలుగొంతున్నారు. ఇది అభిన‌వ భార‌తావ‌ని చూస్తున్న గొప్ప‌ అభివృద్ధి.

అదంతా స‌రే కానీ.. ఈ సినిమా వోడికి.. సంగీతం పేరుతో సినిమాల‌కే అంకిత‌మైన వాడికి దిగ్గ‌జ వ్యాపార‌వేత్త‌, వేల కోట్ల సామ్రాజ్య క‌ర్త‌లు పిలిచి పిల్ల‌నివ్వ‌డ‌మెలా? అనే సందేహం చాలా మందికి వ‌చ్చింది. అనిరుధ్ ర‌విచంద‌ర్ కి మార‌న్ కుటుంబం త‌మ పిల్ల‌ను ఇచ్చి పెళ్లి చేయ‌డంపై చాలా మందికి చాలా సందేహాలున్నాయి. అనిరుధ్ కి అంత బ్యాక్ గ్రౌండ్ ఏం ఉంద‌ని కూడా కొంద‌రు నెటిజ‌నులు ఆరాలు తీస్తున్నారు.

నిజానికి అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ ఏమీ చిన్న‌ది కాదు. అత‌డు ద‌క్షిణాది సినిమాని శాసించిన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ భార్యకి స్వ‌యానా మేన‌ల్లుడు. ఆయన తండ్రి రవి రాఘవేంద్ర న‌టుడు.. తల్లి లక్ష్మి క్లాసికల్ డాన్సర్. ముత్తాత కె సుబ్రమణ్యం ద‌ర్శ‌కుడు. తాత ఎస్‌.వి.రామనన్ టీవీ రంగంలో సుప్ర‌సిద్ధులు. అత‌డు సంగీత ద‌ర్శ‌కుడిగాను రాణించారు. ప్రముఖ భరతనాట్య కళాకారిణి, పద్మవిభూషణ్ డా.పద్మ సుబ్రహ్మణ్యానికి అనిరుధ్ మనవడు అవుతారు. అత‌డి నేప‌థ్యంలో చూస్తే అంద‌రూ క‌ళాకారులే ఉన్నారు. ముఖ్యంగా త‌న నేప‌థ్యంతో ప‌ని లేకుండా అతడు త‌న‌కు అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని నిర్మించుకున్న సామ్రాజ్యం ఎంతో గొప్ప‌ది.

అనిరుధ్ ఒక్క‌డే 60 కోట్లు పైగా సంప‌ద‌ల్ని కూడ‌గ‌ట్టాడు. అత‌డి కుటుంబ స‌భ్యుల ఆస్తి అంత‌స్తుల సంగ‌తి అటుంచితే ఈ యువ సంగీత సంచ‌ల‌నం అంచెలంచెలుగా ఎదిగిన తీరు త‌న‌ స‌మ‌ర్థ‌త‌కు నిద‌ర్శ‌నం. స్వ‌యంగా త‌న‌ను తాను దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడిగా ఆవిష్క‌రించుకున్నాడు. నేడు సౌతిండియా టాప్ -5 సంగీత ద‌ర్శ‌కులలో ఒక‌డిగా అత‌డు ఎదిగిన తీరు అస‌మానం. ఇలాంటి క్వాలిటీస్ చాలా త‌క్కువ మందికే ఉంటాయి. అయితే అత‌డి కుటుంబంలోనే సంగీతం, క‌ళా నేప‌థ్యం ఉంది గ‌నుక‌నే ఇదంతా సాధ్య‌మైంది. చాలా మంది క‌ల‌లు క‌న్న ప్ర‌పంచంలోకి అడుగుపెట్టేయ‌డం .. ఆ త‌ర్వాత త‌ట్టా బుట్టా స‌ర్ధుకుని వెళ్లిపోయిన‌వారే. కానీ త‌న‌కు ఉన్న బ‌ల‌మైన నేప‌థ్య‌మే కాకుండా, త‌న ప్ర‌తిభ‌తో కూడా అనిరుధ్ షైన్ అయ్యాడు. అందుకే ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఉన్న మార‌న్ కుటుంబం త‌మ అల్లుడిగా అనిరుధ్ ని స్వీక‌రించింది. త‌మ ఇంటి పిల్ల కావ్య మార‌న్ ని ఇచ్చి పెళ్లి చేస్తోంది.

సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ 2026లో సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యంత బిజీయెస్ట్ - టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నారు. రజనీకాంత్ నటించిన కూలీ, జైలర్ 2, ద‌ళ‌పతి విజయ్ కెరీర్‌లోని చివరి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్, అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోల భారీ బడ్జెట్ చిత్రాలతో లైనప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతోంది. తనదైన ఎనర్జిటిక్ బీట్స్, క్యాచీ ట్యూన్స్.. వైవిధ్యమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని దిగ్గజ దర్శకుల మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్‌లతో పాటు దాదాపు పదికి పైగా క్రేజీ సినిమాలకు సంగీతం అందిస్తూ అనిరుధ్ ఈ ఏడాది కూడా తన మ్యూజిక‌ల్ హవాను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News