పిక్‌టాక్ : హొయలు పోతున్న అందాల తృప్తి
ప్రతిసారి విభిన్నమైన ఔట్ ఫిట్‌ను ధరించి, అందరి చూపు తనవైపుకు తిప్పుకునే ఈ అమ్మడు తాజాగా మరోసారి ఆకట్టుకునే ఫోటో షూట్‌తో మెప్పించింది.
యానిమల్ సినిమాతో పాన్ ఇండియా స్టార్డం దక్కించుకున్న తృప్తి డిమ్రి ప్రస్తుతం ప్రభాస్‌కి జోడీగా 'స్పిరిట్' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. స్పిరిట్‌తో పాటు ఈ అమ్మడి చేతిలో అరడజను సినిమాలు ఉన్న విషయం తెల్సిందే. వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అంతే కాకుండా ఖాళీ సమయంలో విదేశాల్లో ట్రిప్స్ ను ఎంజాయ్ చేయడం మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. తాజాగా ఈ అమ్మడు లాస్ ఏంజిల్స్ వీధుల్లో తిరుగుతూ ఉన్న ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతిసారి విభిన్నమైన ఔట్ ఫిట్‌ను ధరించి, అందరి చూపు తనవైపుకు తిప్పుకునే ఈ అమ్మడు తాజాగా మరోసారి ఆకట్టుకునే ఫోటో షూట్‌తో మెప్పించింది. తృప్తి డిమ్రి యొక్క అందాల ఆరబోత ఫోటోలు ఎప్పటిలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లాస్ ఏంజిల్స్ వీధుల్లో తృప్తి డిమ్రి...
తృప్తి అక్కడి వీధుల్లో తిరుగుతూ చిల్ అవుతున్న ఈ ఫోటోలకు పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సాధారణంగా చాలా మంది హీరోయిన్స్ ఇలాంటి ఫోటోలను షేర్ చేసిన సమయంలో విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా వీధుల్లో తిరుగుతూ కూడా ఫోటోలు దిగి, షేర్ చేయాలా అంటూ కొందరు కామెంట్స్ చేయడం జరుగుతుంది. అయితే తృప్తికి మాత్రం పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. చాలా అందంగా ఉన్నారు. స్పిరిట్ సినిమాలోనూ ఇలాగే కనిపిస్తే చూడాలని ఉంది అంటూ చాలా మంది కామెంట్ చేయడం చూడవచ్చు. మొత్తానికి తృప్తి డిమ్రి ఏం చేసినా, ఎక్కడ ఉన్నా అందరి దృష్టిని ఆకర్షిస్తూ, అందరిని తన వైపుకు తిప్పుకుంటూ ఉంది. సినిమాలతో కంటే ఎక్కువగా ఈ అమ్మడు సోషల్ మీడియాలోని ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
స్పిరిట్ సినిమాతో వరుసగా...
ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలతో వచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం కొన్ని సినిమాలు చర్చల దశలో ఉంటే, కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాదిలో ఈ అమ్మడు నటించిన మూడు నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రకటించని సినిమాలు కూడా రెండు మూడు ఉన్నాయి. వాటి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. స్పిరిట్ సినిమాపై ఈమె చాలా ఆశలు పెట్టుకుంది. వచ్చే ఏడాదిలో స్పిరిట్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న దర్శకుడు సందీప్ వంగ ఈ సినిమాతో ఆమెకు స్టార్డం తెచ్చి పెట్టడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీపికా పదుకునే ప్లేస్ లో తృప్తిని సందీప్ ఎంపిక చేయడం జరిగింది. కనుక కచ్చితంగా తృప్తి కోసం బెస్ట్ పాత్రను సందీప్ రాసి ఉంటాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
బాలీవుడ్లో తృప్తి డిమ్రి సినిమాలు...
బాలీవుడ్‌తో పాటు సౌత్ లోనూ ఈ అమ్మడికి మంచి డిమాండ్ ఉంది. అయితే బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే నటించాలని ఈమె కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి బయటకు రావడానికి కాస్త సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం స్పిరిట్ పై ఆశలు పెట్టుకున్న ఈ అమ్మడు రాబోయే రోజుల్లో బాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈమెను బాలీవుడ్‌కి చెందిన ఒక హీరోయిన్ కాంపౌండ్ వారు డీ గ్రేడ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారు ప్రతి విషయంలోనూ తృప్తిని టార్గెట్ చేసి విమర్శలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఆ మధ్య వినిపించాయి. ఇప్పుడు తృప్తి పై నెగిటివిటీ కాస్త తగ్గినట్లుగా అనిపిస్తుంది. స్పిరిట్ సినిమా తర్వాత బాలీవుడ్లో ఈమె బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అదే సమయంలో టాలీవుడ్‌లోనూ ఈమె స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకోవచ్చు.