ఆ న‌లుగురు భామ‌లు ఎంత ప్రోఫెష‌న‌ల్ అంటే?

వెండితెరపై కనిపించే మెరుపుతో పాటు అంతర్జాతీయ రెడ్ కార్పెట్‌పై కాలు మోపినప్పుడు తనను తాను ప్రజెంట్ చేసుకునే తీరు కూడా స్టార్‌డమ్‌ను డిసైడ్ చేస్తుంది.

Update: 2026-10-18 01:30 GMT

సెలెబ్రిటీ గ్లామర్ వర్ల్డ్‌లో నటి విజయాన్ని కేవలం నటన మాత్రమే నిర్ణయించదు. వెండితెరపై కనిపించే మెరుపుతో పాటు అంతర్జాతీయ రెడ్ కార్పెట్‌పై కాలు మోపినప్పుడు తనను తాను ప్రజెంట్ చేసుకునే తీరు కూడా స్టార్‌డమ్‌ను డిసైడ్ చేస్తుంది. ఈ ప్రయాణంలో ప్రతి ఐకానిక్ లుక్ వెనుక ఎంతోమంది స్టైలిస్టులు, హెయిర్ డిజైనర్ల నిశిత పరిశీలన దాగి ఉంటుంది. అయితే అంతటి అంతర్జాతీయ స్థాయి వేదికలపై మెరవాలంటే కేవలం మేకప్, డ్రెస్సింగ్ మాత్రమే సరిపోవు... ఆ లుక్‌ను మోసే సత్తా, వంద శాతం ప్రోఫెషనిజం ఆ భామల్లో ఉండాలి. అలాంటి అంకితభావం, పర్‌ఫెక్ట్ స్టైలింగ్ ఉన్న నలుగురు భారతీయ అగ్ర కథానాయికల గ్లామర్ రహస్యాలు పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వ్యక్తమవుతున్నాయి.

గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా జోనాస్ శైలే అత్యంత ప్రత్యేకమైనది. ప్రియాంకలో ఉండే అపరిమితమైన ఆత్మవిశ్వాసం, సరికొత్త ఆలోచనలకు ఇచ్చే స్వేచ్ఛే ఆమెను ప్రతి ఈవెంట్‌లోనూ డిఫరెంట్‌గా నిలబెడతాయి. కేవలం అందంగా కనిపించడం కాకుండా ప్రతి ప్రాజెక్టు లేదా రెడ్ కార్పెట్ వెనుక ఉన్న ఓవరాల్ ప్రొడక్షన్ విజన్‌ను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా హెయిర్ స్టైలింగ్, మేకప్‌ను అడాప్ట్ చేసుకోవడంలో ప్రియాంక ప్రొఫెషనిజం నంబర్ వన్ చెప్పొచ్చు.

దీపికా పదుకొనే విషయానికి వస్తే ఆమె సహజ సిద్ధమైన రాజసం, రాయల్ ఎలిగాన్స్ ప్రతి లుక్‌ను ఓ సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తాయి. దీపికకు తన సొంత శైలిపై చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది. అందుకే ఆమెపై సరికొత్త ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం ఎప్పుడూ క్రేజీగా ఉంటుంది. ఇక్కడ ప్రియాంక, దీపికల విషయంలో గమనించాల్సిన ప్రధానాంశం ఏంటంటే? వారు ధరించే దుస్తులు లేదా హెయిర్ స్టైల్స్ వారిని డామినేట్ చేయవు. తమ సొంత వ్యక్తిత్వమే ఆ స్టైల్‌ను డామినేట్ చేసేలా జాగ్రత్తపడతారు.

ఇక ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ప్రెజెన్స్‌లోనే కాలాతీతమైన అందం దాగి ఉంది. దశాబ్దాలుగా సినీ రంగాన్ని, అంతర్జాతీయ వేదికలను ఏలుతున్న ఐశ్వర్య తనను తాను క్యారీ చేసే తీరు అత్యంత అద్భుతం. ఎప్పటికప్పుడు కొత్తదనంతో మెరిసే నేటి తరం నటి శ్రద్ధా కపూర్ లుక్స్‌లో సున్నితత్వం, ఆధునికత చాలా చక్కగా కలగలిసి ఉంటాయి. సరికొత్త స్టైలింగ్ ఆవిష్కరణలను ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా ముందుకు తీసుకెళ్లడంలో శ్రద్ధా స్టైల్ ప్రత్యేకమైనది.

గ్లామర్ ప్రపంచంలో ట్రెండ్స్‌ను గుడ్డిగా ఫాలో అయిపోవడం కాకుండా.. ప్రతి నటి తన వ్యక్తిత్వానికి తగినట్లుగా లుక్స్ డిజైన్ చేసుకున్నప్పుడే అసలైన ఐకానిక్ లుక్స్ బయటకు వస్తాయి. పరస్పర నమ్మకం, ఒకే రకమైన విజన్ ఉన్నప్పుడు క్రియేటివ్ ప్రాసెస్ ఎంతో ఆనందంగా సాగుతుంది. గ్రాండ్ రెడ్ కార్పెట్ ఈవెంట్ల నుంచి సింపుల్ అండ్ రిలాక్స్డ్ లుక్స్ వరకు, తమ సొంత వ్యక్తిత్వాన్ని ఎక్కడా కోల్పోకుండా మెరిసే ఈ భామల నిబద్ధతే వారిని ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలబెడుతోంది.

Tags:    

Similar News