రష్మిక విజయ్.. జనాల్లోకి వెళితే ఇట్లుంటది మరి!

టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్లకు ఉండే ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. తెర మీద వీళ్ల కెమిస్ట్రీ ఎంత మ్యాజిక్ చేస్తుందో, ఆఫ్ స్క్రీన్ లో జనాల్లోకి వచ్చినా అంతే స్థాయిలో రచ్చ కనిపిస్తుంది.

Update: 2026-10-17 17:06 GMT

టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్లకు ఉండే ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. తెర మీద వీళ్ల కెమిస్ట్రీ ఎంత మ్యాజిక్ చేస్తుందో, ఆఫ్ స్క్రీన్ లో జనాల్లోకి వచ్చినా అంతే స్థాయిలో రచ్చ కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీకి యూత్ లో ఉన్న స్పెషల్ బజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు 'రణబాలి' సినిమా రిలీజ్ తర్వాత ఈ జంట డైరెక్ట్ గా పబ్లిక్ లోకి రావడంతో థియేటర్ల దగ్గర సెన్సేషన్ క్రియేట్ అవుతోంది.




లేటెస్ట్ గా ఈ హిట్ పెయిర్ గుంటూరులోని మైత్రీ సినిమాస్ కు వెళ్లినప్పుడు అక్కడ కనిపించిన క్యూరియాసిటీ అంతా ఇంతా కాదు. వాళ్లు వస్తున్నారనే విషయం తెలియగానే మాల్ మొత్తం పైనుంచి కింద వరకు జనంతో కిక్కిరిసిపోయింది. తమ ఫేవరెట్ స్టార్స్ ను చూడగానే ఫ్యాన్స్ చేసిన అరుపులతో ఆ ఏరియా మొత్తం దద్దరిల్లిపోయింది. ఆ హడావుడి చూస్తుంటే జనాలు సినిమాను మించి ఈ జోడీని చూడటానికే ఎక్కువ ఎగబడ్డారని ఇట్టే అర్థమవుతోంది.




ఈ ఈవెంట్ లో విజయ్, రష్మిక అప్పీరెన్స్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. డీప్ బ్లూ కలర్ కుర్తాలో విజయ్ తనదైన రస్టిక్ లుక్ లో కనిపించగా, మెరూన్ కలర్ ట్రెడిషనల్ శారీలో రష్మిక ఎంతో క్యూట్ గా మెరిసిపోయింది. మాల్ బాల్కనీలో నిలబడి వేలాది మంది ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ.. వాళ్ల ప్రేమను క్యాప్చర్ చేసుకునేందుకు రష్మిక తన ఫోన్ తో సెల్ఫీలు దిగిన మోమెంట్స్ ఫుల్ హైలైట్ అయ్యాయి.

వీళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్, ఆ కెమిస్ట్రీ ఆడియన్స్ కు భలే కిక్ ఇస్తుంది. సినిమాల సంగతి పక్కన పెడితే, పబ్లిక్ లో ఇద్దరూ కలిసి కనిపించినప్పుడు ఆ ఫ్రేమ్ కు ఉండే వైబ్ వేరు. ఫ్యాన్స్ కేరింతల మధ్య ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్న ఫోజులు ఈ పెయిర్ కున్న బ్యూటిఫుల్ సింక్ ను మరోసారి ప్రూవ్ చేశాయి. యూత్ వాళ్లను ఎంతలా ఓన్ చేసుకున్నారో ఈ పిక్స్ చూస్తే క్లియర్ గా తెలుస్తుంది.

కేవలం హైదరాబాద్ కే పరిమితం కాకుండా ఇలా ఏపీలోని లోకల్ సెంటర్లకు వెళ్లి ఫ్యాన్స్ ను కలవడం అనేది ప్రమోషన్స్ పరంగా మంచి స్ట్రాటజీ. జనాలతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల గ్రౌండ్ లెవెల్ లో మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా విజయ్, రష్మిక లాంటి క్రేజ్ ఉన్న స్టార్స్ స్వయంగా వచ్చి పలకరిస్తే లోకల్ ఫ్యాన్స్ కు వచ్చే ఆ కిక్కే వేరు. 'రణబాలి' సినిమా రిజల్ట్, బాక్సాఫీస్ టాక్ సంగతి పక్కన పెడితే.. ఈ జోడీకి ఉన్న పబ్లిక్ పుల్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని గుంటూరు ఈవెంట్ తో ప్రూవ్ అయింది. జనాలు తమని ఎంతగా ఆదరిస్తున్నారో ఈ విజిట్ తో వాళ్లకు క్లియర్ గా అర్థమైంది. ఈ ఎనర్జీ, పబ్లిక్ రెస్పాన్స్ లాంగ్ రన్ లో సినిమా ఫుట్ ఫాల్స్ ను పెంచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

Tags:    

Similar News