బీచ్‌లో ఆద‌మ‌రిచి సెల్ఫీలు దిగిన క‌పూర్ గాళ్

బోలీవుడ్ యంగ్ బ్యూటీ, స్టార్ కిడ్ ఖుషీ కపూర్ ప‌రిచయం అవ‌స‌రం లేదు. శ్రీ‌దేవి రెండో కుమార్తెగా, జాన్వీక‌పూర్ సోద‌రిగా అంద‌రికీ బాగా తెలిసిన అమ్మాయి.

Update: 2026-10-17 15:13 GMT

బోలీవుడ్ యంగ్ బ్యూటీ, స్టార్ కిడ్ ఖుషీ కపూర్ ప‌రిచయం అవ‌స‌రం లేదు. శ్రీ‌దేవి రెండో కుమార్తెగా, జాన్వీక‌పూర్ సోద‌రిగా అంద‌రికీ బాగా తెలిసిన అమ్మాయి. వీట‌న్నిటినీ మించి ఖుషీ నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో త‌న ఫాలోవ‌ర్స్ కు ట‌చ్ లో ఉంటుంది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. నో ప్లేస్ ఐ వుడ్ రేద‌ర్ బి అనే క్యాప్షన్ తో మాల్దీవులలోని జెడబ్ల్యూ మారియాట్ రిసార్ట్ లో గడిపిన ఆహ్లాదకరమైన క్షణాలను అభిమానులతో షేర్ చేసారు ఖుషీ. లగ్జరీ వెకేషన్ మోడ్ లో ఉన్న ఖుషీ, తన లేటెస్ట్ లుక్స్ తో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇక ఖుషీ టూపీస్ బికినీలో చెల‌రేగిన ఫోటోలు, సెల్ఫీలు యూత్ లోకి దూసుకెళుతున్నాయి.




ఈ గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే లక్షలాది లైకులు, కామెంట్లతో ఇన్‌స్టాగ్రామ్ హోరెత్తింది. ఖుషీ ఫ్యాషన్ సెన్స్, ఫిట్‌నెస్ , గ్లామరస్ అప్పీరెన్స్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఫోటో కామెంట్ సెక్షన్ లో నెటిజన్ల స్పందన ఆసక్తికరంగా మారింది. హెర్ బ్యూటీ ఈజ్ అన్ రియ‌ల్.. ఫేస్ కార్డ్ నెవ్వ‌ర్ డిక్లైన్డ్.. అంటూ అభిమానులు ఆమె అందాన్ని కొనియాడుతుంటే.. మరికొందరు ఫన్నీ కామెంట్లు మరియు ప్రశ్నలతో సందడి చేశారు. బాలీవుడ్ సెలబ్రిటీలు, తోటి నటీనటులు సైతం ఈ పోస్ట్‌కు హార్ట్, ఫైర్ ఎమోజీలతో తమ లైకులను తెలిపారు.




ప్రస్తుతం ఖుషీ కపూర్ తన తదుపరి సినిమాల తో బిజీగా ఉంటూనే, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్లు- సోషల్ మీడియా ప్రెజెన్స్ తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న ఖుషీ లేటెస్ట్ ఫోటోషూట్ లతో నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు.




ప్రముఖ నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ ల చిన్న కుమార్తె అయిన ఖుషీ కపూర్, జోయా అక్తర్ దర్శకత్వంలో వచ్చిన `ది ఆర్చీస్` (2023) నెట్‌ఫ్లిక్స్ చిత్రం ద్వారా నటిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత జునైద్ ఖాన్‌తో కలిసి రొమాంటిక్ కామిడీ చిత్రం `ల‌వ్యాపా`లో నటించింది. ఇబ్రహీం అలీ ఖాన్‌తో కలిసి నటిస్తున్న రొమాంటిక్ డ్రామా `నాదానియాన్` కూడా విడుద‌లైంది. అయితే ఆశించిన విజ‌యాలు ద‌క్క‌క‌పోయినా ఖుషీ నెమ్మ‌దిగా ఒక్కో సినిమాతో ప‌రిణ‌తి చెందుతోంది. ఖుషీ త‌దుపరి సినిమా గురించిన వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.




Tags:    

Similar News