తారక్, త్రివిక్రమ్.. అసలైనది ఎప్పుడు రివీల్ చేస్తారో..

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

Update: 2026-10-17 13:16 GMT

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా గురించి ఎప్పుడు ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అభిమానుల్లో హైప్ పెరుగుతోంది. ముఖ్యంగా ఆ మూవీ గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ బయటకు రావడంతో అదే టైటిల్‌ తో సినిమా రాబోతుందని చాలామంది సినీ ప్రియులు భావిస్తున్నారు. ఫ్యాన్స్ అయితే దాదాపు ఫిక్స్ కూడా అయిపోయారు.

కానీ ఇప్పుడు నిర్మాత నాగవంశీ ఇచ్చిన క్లారిటీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాడ్ ఆఫ్ వార్ అనేది ఆ సినిమాకు అఫీషియల్ టైటిల్ కాదని నాగవంశీ స్పష్టం చేశారు. అందరూ ప్రస్తుతం ఆ పేరుతోనే సినిమా గురించి మాట్లాడుకుంటున్నారని, అయితే కథలో ఆ పేరును ఎలా ఉపయోగించాలనేది హీరో ఎన్టీఆర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న టైటిల్ పై కొంత క్లారిటీ వచ్చినట్లయింది.

కానీ అసలు టైటిల్ ఏంటనే ప్రశ్నకు మాత్రం ఇంకా ఆన్సరక్ దొరకలేదు. నిజానికి ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తున్నారనే అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ఆ ప్రాజెక్టుపై ఆసక్తి మొదలైంది. వీరిద్దరి కాంబిలో గతంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ఆ ఇద్దరూ కలిసి భారీ రేంజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో అంచనాలు పెరిగాయి.

అందులోనూ ఈసారి డివోషనల్ బ్యాక్ డ్రాప్ ను సెలెక్ట్ చేసుకోవడం సినిమాపై ఇంట్రెస్ట్ మరింత పెంచుతోంది. మూవీ స్టోరీ కుమారస్వామి, మురుగన్‌ కు సంబంధించిన పురాణాల చుట్టూ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. యుద్ధానికి సంబంధించిన అంశాలతో పాటు, ప్రస్తుత రోజులకు సరిపోయే కథను కూడా ఇందులో చూపించనున్నట్లు సమాచారం. ఆ స్టోరీకి త్రివిక్రమ్ తనదైన శైలిలో మార్పులు చేసి రెడీ చేసినట్లు తెలుస్తోంది.

అయితే స్టోరీకి సంబంధించిన పూర్తి వివరాలను మూవీ టీమ్ ఇంకా వెల్లడించలేదు. మరోవైపు దేవసేనాపతి అనే టైటిల్ ను కూడా నిర్మాతలు రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. అయితే ఏ టైటిల్ ఫిక్స్ అయిందో ఇప్పుడే చెప్పలేం. సినిమా కథ, అందులో ఎన్టీఆర్ రోల్ ను బట్టి ఫైనల్ టైటిల్ ను డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. జనవరిలో అసలు టైటిల్‌ ను రివీల్ చేస్తామని త్రివిక్రమ్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అప్పటివరకు అభిమానులు ఎదురుచూడాల్సిందే.

ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా కంప్లీట్ అయ్యాక త్రివిక్రమ్ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. 2027లో ఆ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ఆ మూవీని నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ మూవీ సెట్స్ లోకి తారక్ అడుగుపెట్డనుండగా, సినిమా అసలైన టైటిల్ ను జనవరిలోనే వెల్లడిస్తారా, అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఎలాంటి టైటిల్‌ ను ఫిక్స్ చేస్తారనేది చూడాలి.



Tags:    

Similar News