వెంకీ అట్లూరి సార్, లక్కీ భాస్కర్ కథలను తెలుగు హీరోలకు వినిపించాడా?

తెలుగులో టాలెంటెడ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నప్పటికి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును తెచ్చుకున్న వెంకీ అట్లూరి కి సపరేట్ స్టైల్ ఉంది.

Update: 2026-10-17 12:30 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలోని హీరోలు పాన్ ఇండియా బాటపడుతున్నారు. ప్రేక్షకులను అలరించడానికి డిఫరెంట్ సబ్జెక్టులను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొన్నిసార్లు మంచి సబ్జెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తే మరికొన్ని సందర్భాల్లో సక్సెస్ ఫుల్ కథలను సెలెక్ట్ చేసుకోవడంలో తడబడుతున్నారు.

వెంకీ అట్లూరి ని పక్కన పెట్టడానికి కారణం...

తెలుగులో టాలెంటెడ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నప్పటికి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును తెచ్చుకున్న వెంకీ అట్లూరి కి సపరేట్ స్టైల్ ఉంది. ధనుష్ తో చేసిన 'సార్' సినిమాని మొదట తెలుగు టైర్ 2 హీరోకి వినిపించారట. కానీ ఆ హీరో కి కథ నచ్చకపోవడం వల్ల దానిని రిజెక్ట్ చేశాడు. దాంతో వెంకీ అట్లూరి ఈ కథని ధనుష్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఈ స్టోరీ తనకి బాగా నచ్చడంతో వీళ్ళ కాంబోలో 'సార్' మూవీ వచ్చి సూపర్ సక్సెస్ ను సాధించింది... ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ ను హీరోగా పెట్టి చేసిన 'లక్కీ భాస్కర్' సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. వెంకీ అట్లూరి నుంచి ఇలాంటి ఒక డీసెంట్ సినిమా వచ్చి భారీ హిట్ అవ్వడంతో అతని క్రేజ్ తార స్థాయి కి వెళిపోయింది.

'లక్కీ భాస్కర్' సినిమాను సైతం టైర్ 2 హీరోకి వినిపించారట. కానీ ఆ హీరో ఈ కథ చాలా సాప్ట్ గా ఉందని అది తనకి సెట్ అవ్వదని ఆ స్టోరీ ని రిజెక్ట్ చేశాడు. మొత్తానికైతే మలయాళం టాప్ హీరో దుల్కర్ సల్మాన్ తో మూవీ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇదంతా చూసిన సినీ విమర్శకులు మన టైర్ 2 హీరోలు మాస్ సినిమాల వైపు అడుగులు వేస్తూ సాప్ట్ సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా వెంకీ అట్లూరి సూర్య తో చేసిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీతో హ్యాట్రిక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు... ఈ మూడు సినిమాలతో వెంకీ అట్లూరి కి సపరేట్ గా ఒక స్టైల్ క్రియేట్ అయింది. ఆయన మూవీస్ కి ఫ్యాన్ బేస్ ఏర్పడింది...

Tags:    

Similar News