ఏయ్ జూడ్.. ఏంటీ సడన్ ట్విస్ట్

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండేవాళ్లు సడెన్ గా సైలెంట్ అయిపోతే ఫాలోవర్స్ కు కచ్చితంగా డౌట్ వస్తుంది.

Update: 2026-10-17 13:15 GMT

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండేవాళ్లు సడెన్ గా సైలెంట్ అయిపోతే ఫాలోవర్స్ కు కచ్చితంగా డౌట్ వస్తుంది. యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ ఏయ్ జూడ్ విషయంలో రీసెంట్ గా సరిగ్గా ఇదే జరిగింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలన్నీ ఒక్కసారిగా డిలీట్ చేసేసి ఫాలోవర్స్ ను కన్ఫ్యూజన్ లో పడేశాడు. అసలు ఏమైందా అని ఫాలోవర్స్ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న టైమ్ లో.. తాను మెయిన్ హీరోగా మారబోతున్నానంటూ ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు.




మొదట్లో ఫ్యాషన్, లైఫ్ స్టైల్ టిప్స్ తో యూత్ కు బాగా కనెక్ట్ అయిన అజయ్.. ఆ తర్వాత రెగ్యులర్ ట్రెండింగ్ టాపిక్స్ పై వీడియోలు చేస్తూ తనకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. మంచి స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీతో డిజిటల్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ యూట్యూబర్.. ఇప్పుడు తనకున్న ఆ క్రేజ్ ను వెండితెరపై క్యాష్ చేసుకుంటూ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఫుల్ గా రెడీ అయ్యాడు.




అజయ్ హీరోగా పరిచయమవుతున్న ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు రామానాయుడు స్టూడియోస్ లో చాలా గ్రాండ్ గా జరిగాయి. రాము కొప్పుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ను నెక్సస్ సినిమాస్, స్కైబ్లేజ్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్లపై నెక్సస్ శ్రీధర్, దీపక్ ముస్త్యాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా, సైలెంట్ గా సినిమాను లాంచ్ చేసి డిజిటల్ ఆడియన్స్ అందరినీ సర్ ప్రైజ్ చేశాడు ఈ కుర్ర హీరో.

ఈ ఓపెనింగ్ ఈవెంట్ కు టాలీవుడ్ నుంచి పలువురు స్టార్ డైరెక్టర్లు గెస్టులుగా హాజరై సందడి చేయడం విశేషం. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ చిత్రానికి క్లాప్ కొట్టగా, సీనియర్ దర్శకుడు బి. గోపాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇక బుచ్చిబాబు సానా తొలి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. వీళ్లతో పాటు బెజవాడ ప్రసన్న, థామస్ రెడ్డి, సత్యం రాజేష్ తదితరులు పాల్గొని టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఒక యూట్యూబర్ డెబ్యూ సినిమా అయినా సరే, టెక్నికల్ టీమ్ ను మాత్రం చాలా స్ట్రాంగ్ గానే సెట్ చేసుకున్నారు మేకర్స్. హిట్ చిత్రాల సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా, ఫహద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటున్నారు. క్రాంతి ప్రియం ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ క్రేజీ టీమ్ ను చూస్తుంటే ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని క్లియర్ గా అర్థమవుతోంది.

షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ వీడియోలు చేసుకునే కుర్రాళ్లు వెండితెరపై సక్సెస్ అవ్వడం టాలీవుడ్ కు కొత్తేమీ కాదు. సుహాస్ లాంటి వాళ్లు ఇప్పటికే ఆ ట్రాక్ లో ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏయ్ జూడ్ కూడా అదే రూట్ లో వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. కేవలం పది నిమిషాల వీడియోలతో సోషల్ మీడియాలో తన స్టైల్ ను చూపించిన అజయ్, ఇప్పుడు రెండున్నర గంటల పాటు సిల్వర్ స్క్రీన్ పై ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.

Tags:    

Similar News