ఆరెంజ్ మూవీలోని ఒక్క సీన్ తీసుకొని సినిమా చేసిన యంగ్ డైరెక్టర్...సూపర్ హిట్ అయిందిగా...

ఆరెంజ్ సినిమాలో ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం మీద ఒక సీన్ ఉంటుంది. అప్పట్లో ఫోన్ యూజ్ ఎక్కువగా లేదు. కాబట్టి ఆ ఫోన్ ఇచ్చే సీన్ పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించలేదు.

Update: 2026-10-17 19:30 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీ సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఇండియా వైడ్ గా మన హీరోలకు ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. రామ్ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆరెంజ్' సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. మగధీర తర్వాత వచ్చిన సినిమా కాబట్టి ఈ మూవీ మీద భారీ హైప్ ఉండటంతో ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. మొత్తానికైతే ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో బొమ్మరిల్లు భాస్కర్ మీద తీవ్రమైన విమర్శలైతే వచ్చాయి. అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికి ఇప్పుడు మాత్రం కల్ట్ క్లాసిక్ సినిమాగా చెబుతున్నారు. రీ రిలీజ్ చేసినప్పుడు ఈ సినిమాని చూడడానికి యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఇంట్రెస్ట్ చూపించారు. మొదట మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ టైమ్ లో ఉన్న ప్రేక్షకుల మైండ్సెట్ కి రీచ్ అవ్వలేదు. కానీ ఇప్పుడున్న జనరేషన్ కి ఈ సినిమా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది అంటూ చాలామంది సినీ విమర్శకులు సైతం కామెంట్లు చేయడం విశేషం...

ఒక్క సీన్ తో సినిమానే వచ్చిందా

ఆరెంజ్ సినిమాలో ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం మీద ఒక సీన్ ఉంటుంది. అప్పట్లో ఫోన్ యూజ్ ఎక్కువగా లేదు. కాబట్టి ఆ ఫోన్ ఇచ్చే సీన్ పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించలేదు. కానీ ఇప్పుడున్న జనాలు ఫోన్ కి ఎక్కువగా అడిక్ట్ అయిపోయారు. ఒకరి ఫోన్లో ఎన్నో సీక్రెట్ లు ఉంటాయి. ఫోన్స్ ఇవ్వడానికి ఎవ్వరు ఇష్టపడరు. అదే పాయింట్ మీద యంగ్ డైరెక్టర్ అయిన ప్రదీప్ రంగనాథన్ 'లవ్ టుడే' సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఆ థాట్ ఈ జనరేషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండడంతో సినిమా సూపర్ సక్సెస్ అయింది.

ఆరెంజ్ సినిమా అప్పుడు ఆడక పోవడానికి కారణం అప్పుడు ఫోన్లు వాడే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. అలాగే ఆ సన్నివేశం ప్రేక్షకులకు పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించలేదు. ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి అప్పుడున్న ప్రేక్షకుల మెంటాలిటీని బేస్ చేసుకొని అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా సినిమాని తెరకెక్కించాలి. అడ్వాన్స్డ్ ఆలోచనలతో సినిమాని తీస్తే కొన్ని సందర్భాల్లో సక్సెస్ ని సాధించవచ్చు కానీ అప్పుడున్న ప్రేక్షకుల మైండ్ సెట్ ప్రకారం ఆ సినిమా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి...

Tags:    

Similar News