అమ్మవారి కథతో అల్లరోడు.. అసలు సవాల్ ఇదే!

నిజానికి తెలుగులో ఒకప్పుడు డివోషనల్ మూవీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేది.

Update: 2026-10-18 05:53 GMT

కామెడీ సినిమాలతో ప్రేక్షకులను నవ్వించిన హీరో అల్లరి నరేష్.. ఇప్పుడు తనదైన యాక్టింగ్ తో కొత్త గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నాంది, ఉగ్రం వంటి సినిమాలతో తనలోని మరో యాంగిల్ ను చూపించిన ఆయన.. ఇప్పుడు కనకదుర్గ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చాలా కాలం తర్వాత అమ్మవారి బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా వస్తుండటంతో ఆ ప్రాజెక్టుపై అప్పుడే ఇంట్రెస్ట్ మొదలైంది.

నిజానికి తెలుగులో ఒకప్పుడు డివోషనల్ మూవీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేది. అమ్మవారి మహిమలు, భక్తుల కష్టాలు, చివరికి దైవం చూపించే సొల్యూషన్ వంటి అంశాలతో చాలా సినిమాలు వచ్చాయి. విజయవాడ కనకదుర్గమ్మ బ్యాక్ డ్రాప్ లో కూడా మూవీలు తెరకెక్కాయి. అయితే ఇప్పుడు ప్రేక్షకుల టేస్ట్ మారింది. పాత సినిమాల్లో చూపించిన తరహా సీన్స్ మళ్లీ చూపిస్తే ఎంతవరకు రెస్పాన్స్ వస్తుందనేది చెప్పలేం.

అందుకే కనకదుర్గ విషయంలో దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఎలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు, దాన్ని ఎలా చూపించబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో అల్లరి నరేష్ భవాని మాల ధరించిన భక్తుడి పాత్రలో కనిపించనున్నారు. జీవితంలో అన్నీ కోల్పోయిన ఓ వ్యక్తి.. కనకదుర్గమ్మతో ముడిపడిన పరిస్థితుల వల్ల ఎలాంటి మార్పులు జరిగాయన్నది కథలో మెయిన్ ఎలిమెంట్ గా తెలుస్తోంది.

ఆ బ్యాక్ డ్రాప్ ను ప్రేక్షకులకు దగ్గరగా తీసుకెళ్లాలంటే హీరో ఎదుర్కొనే కష్టాలు, అతని జీవితంలో వచ్చే ఛేంజెస్ కు స్ట్రాంగ్ రీజన్స్ ఉండాలి. దేవుడి మహిమను చూపించడమే కాకుండా.. ఆ దేవుడిపై నమ్మకం ఓ మనిషికి ఎంతటి ధైర్యాన్ని ఇస్తుందనేది కూడా కథలో కనిపించాలి. భవాని మాల దీక్షకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. దీక్షలో ఉండే భక్తుల నియమాలు, వారి నమ్మకం, భక్తిని నేచురల్ గా చూపిస్తే కొత్త ఎక్స్ప్రీయన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

ముఖ్యంగా విజయవాడ ఇంద్రకీలాద్రి, కృష్ణా నది పరిసరాల నేపథ్యంలో కథను నడిపిస్తే సినిమాకు స్పెషాలిటీ వస్తుంది. అయితే ఆ అంశాలన్నీ కథలో నేచురల్ గా కలిసిపోవాలి. కేవలం భారీ సన్నివేశాల కోసం భక్తిని వాడుకున్నట్లు అనిపించకూడదు. కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్.. నాంది, ఉగ్రం సినిమాలతో సీరియస్ పాత్రలు కూడా చేయగలనని నిరూపించారు. ఇప్పుడు కనకదుర్గలోనూ ఆయన యాక్టింగి మెయినే.

సినిమాకు బీవీఎస్ రవి కథ అందిస్తుండగా, కాజల్ చౌదరి హీరోయిన్ గా, సుబ్బరాజు కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పాజిటివ్ ఎఫెక్ట్ చూపితే మంచి ఎక్స్ప్రీయన్స్ రావొచ్చు. అదే సమయంలో అల్లరి నరేష్ కు ఇప్పుడు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అవసరం. అందుకే ఆ మూవీ హిట్ అవ్వాలంటే పాత సినిమాల పద్ధతిని ఫాలో అవ్వడం కంటే, ఇప్పటి ప్రేక్షకులకు నచ్చేలా కథను చెప్పడం ముఖ్యం. భక్తి, యాక్షన్, ఎమోషన్స్ ను సరిగ్గా మిక్స్ చేస్తే.. అల్లరోడు కమ్ బ్యాక్ ఇవ్వడం పక్కా. మరేం జరుగుతుందో..

Full View
Tags:    

Similar News