అక్క ర‌క్త త‌ర్ప‌ణం.. ఇది క‌దా మ‌హాన‌టి నుంచి ఆశించిన‌ది..!

ఈ టీజర్‌లో కీర్తి సురేష్ ఎంట్రీ.. త‌న అద్భుత‌ నటన .. డిఫరెంట్ స్వాగ్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Update: 2026-10-18 06:05 GMT

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా వేదికగా `అక్క` అనే క్రేజీ వెబ్ సిరీస్ అఫీషియల్ టీజర్ విడుదలై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నేషనల్ అవార్డు గ్రహీత కీర్తి సురేష్.. వైవిధ్యమైన నటనకు పేరుగాంచిన రాధికా ఆప్టే.. అనుభవజ్ఞురాలైన తన్వి అజ్మీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) నిర్మించింది. `అబ్ చలేగా బెహనో కా శాసన్` అనే పవర్ ఫుల్ క్యాప్షన్‌తో విడుదలైన ఈ టీజర్, మహిళా శక్తికి.. వారి మధ్య ఉండే బలమైన అనుబంధానికి అద్దం పడుతోంది.

ఈ టీజర్‌లో కీర్తి సురేష్ ఎంట్రీ.. త‌న అద్భుత‌ నటన .. డిఫరెంట్ స్వాగ్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అక్టోబర్ 17న కీర్తి సురేష్ పుట్టినరోజు కావడం.. అలాగే అదే రోజు మహానటి సావిత్రి జయంతి కూడా ఉండటంతో.. ఫ్యాన్స్ ఈ టీజర్ రిలీజ్‌ను బర్త్‌డే స్పెషల్ గిఫ్ట్‌గా భావిస్తున్నారు. కీర్తి సురేష్ కంబ్యాక్ అద్భుతంగా ఉండబోతోందని.. త‌మ అభిమాన న‌టి స్క్రీన్ ప్రెజెన్స్ టీజర్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచిందని కామెంట్స్ సెక్షన్‌లో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ``అక్క ర‌క్త త‌ర్ప‌ణం.. అక్క ఉగ్ర‌రూపం.. కీర్తి వ్వాటే ఛాయిస్ అక్కా`` అంటూ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. నిజానికి మ‌హాన‌టిగా నిరూపించిన కీర్తి సురేష్ కి స‌రైన పాత్ర ప‌డితే ఎలా ఉంటుందో ఈ టీజ‌ర్ చెబుతోంద‌ని కూడా అభిమానులు మురిసిపోతున్నారు. ఇది క‌దా జాతీయ అవార్డ్ న‌టి నుంచి ఆశించిన‌ది..! అంటూ ప్ర‌శంసిస్తున్నారు. మ‌రోసారి అక్క‌గా కీర్తి న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌కు జాతీయ అవార్డ్ ఖాయం అన్న చ‌ర్చ మొద‌లైంది.

మరోవైపు నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్‌లలో తరచూ కనిపించే రాధికా ఆప్టే ఈ సిరీస్‌లోనూ కీలక పాత్రలో అలరించనున్నారు. దీంతో కామెంట్ సెక్షన్‌లో నెటిజన్లు రాధికా ఆప్టే - నెట్‌ఫ్లిక్స్ సంబంధాన్ని సరదాగా ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. రాధిక‌ నటన, క్యారెక్టర్ డెప్త్ ఈ సిరీస్‌పై మరింత ఆసక్తిని పెంచాయి. దక్షిణాది సంస్కృతిని, ముఖ్యంగా `చెండ మేళం` బ్యాక్‌డ్రాప్‌ను ఎంతో గ్రాండ్‌గా, పద్ధతిగా చూపించడంపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ టీజర్‌కు విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ లభించగా.. కామెంట్లలో నెటిజన్లు పలు ఆసక్తికరమైన అంశాలను చర్చించారు. సిరీస్ విజువల్స్.. లైటింగ్ వర్క్ చాలా బాగున్నాయని.. అయితే క్రెడిట్స్ సెక్షన్‌లో సినిమాటోగ్రాఫర్ పేరును మిస్ చేయడంపై కొంతమంది నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కెమెరా వెనుక ఉండే ఆర్టిస్టులకు కూడా తగిన గుర్తింపు లభించాలని వారు కామెంట్స్ రూపంలో కోరారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా పవర్ ఫుల్ కాస్టింగ్ - గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కిన ఈ క్రైమ్ డ్రామా సిరీస్ `అక్క` అక్టోబర్ 30 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. నారీ శక్తిని ఎలివేట్ చేస్తూ యశ్ రాజ్ ఫిల్మ్స్ సమర్పిస్తున్న ఈ డిజిటల్ ప్రాజెక్ట్ ఓటీటీ లవర్స్‌కు.. కీర్తి సురేష్, రాధికా ఆప్టే అభిమానులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని భావిస్తున్నారు.

Full View
Tags:    

Similar News