మాస్ సినిమాల్లో.. ఇది మరీ ఓవర్?

ఒకప్పుడు హీరో ఎంట్రీ అంటేనే థియేటర్‌ లో సందడి కనిపించేది. హీరో నడిచొచ్చే తీరు, చెప్పే డైలాగ్స్, అతడి ధైర్యం ఆకట్టుకునేవి. ఇప్పుడు కూడా అలాంటి సీన్లు వస్తున్నాయి.

Update: 2026-10-18 07:30 GMT

సినిమా చూస్తున్న ప్రేక్షకుడు హీరోను చూసి చప్పట్లు కొట్టాలి.. విలన్‌ ను చూసి కోపం తెచ్చుకోవాలి.. హీరో గెలిస్తే ఆనందపడాలి. ఇదంతా కామనే. కానీ ప్రేక్షకుల్లో ఆ ఫీలింగ్స్ రావడానికి దర్శకుల ప్లాన్లు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా మాస్ సినిమా అంటే వైలెన్స్ ఎక్కువగా ఉండాలనే ఆలోచన కనిపిస్తోందా అనే ప్రశ్న వినిపిస్తోంది. స్టోరీలో స్త్రెంత్ కంటే వైలెన్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనే డౌట్ కూడా వస్తోంది.

ఒకప్పుడు హీరో ఎంట్రీ అంటేనే థియేటర్‌ లో సందడి కనిపించేది. హీరో నడిచొచ్చే తీరు, చెప్పే డైలాగ్స్, అతడి ధైర్యం ఆకట్టుకునేవి. ఇప్పుడు కూడా అలాంటి సీన్లు వస్తున్నాయి. అయితే కొన్ని మూవీస్ లో హీరోను గొప్పగా చూపించాలంటే చుట్టూ జరిగే వైలెన్స్ ను ఫుల్ గా పెంచుతున్నారు. విలన్ ఎంత చెడ్డవాడో చెప్పడానికి లిమిట్స్ క్రాస్ చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. దీంతో అసలు కథ కంటే ఆ సీన్స్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది.

అయితే ప్రేక్షకులకు కోపం తెప్పించడం వేరు.. వారిని స్టోరీలో ఇన్వాల్వ్ చేయడం వేరు. స్క్రీన్ పై జరిగే ప్రతి ఇన్సిడెంట్ ప్రేక్షకుడికి కనెక్ట్ కావాలంటే దాని వెనుక సరైన రీజన్ ఉండాలి. కేవలం షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో సన్నివేశాలు పెడితే అవి కాసేపు మాత్రమే ఆశ్చర్యపరచవచ్చు. కానీ సినిమా పూర్తయ్యాక మనసులో నిలిచిపోతాయని చెప్పలేం. నిజానికి ప్రేక్షకులను కదిలించడానికి పెద్ద పెద్ద సీన్లే అవసరం లేదు.

ఒక రోల్ కు ఎదురైన కష్టం, ఆ పాత్ర తీసుకునే నిర్ణయం, తన వాళ్ల కోసం చేసే ప్రయత్నం స్ట్రాంగ్ ఎమోషన్స్ ను షేర్ చేయగలవ్. కథలోని బాధ ప్రేక్షకుడికి అర్థమైతే హీరోపై అభిమానం పెరుగుతుంది. అతడు చేసే పోరాటానికి అర్థం కనిపిస్తుంది. అదే లేకుండా వరుసగా ఫైట్లు చూపిస్తే సినిమాలో జోష్ ఉందని అనిపించినా, కథలోని అసలు విషయం వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.

అయితే మాస్ సినిమాలకు వైలెన్స్ అవసరమయ్యే సందర్భాలు ఉంటాయి. ప్రేక్షకులు కూడా అలాంటి సీన్స్ ఆస్వాదిస్తారు. కానీ ఎంత చూపించాలి, ఎక్కడ ఆపాల నేది దర్శకుడి ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. కథకు అవసరం లేని విషయాలు కూడా చేరితే అసలు యూజ్ ఉండదు. మరోవైపు, ప్రేక్షకులు ఇప్పుడు ఎన్నో రకాల కథలు చూస్తున్నారు. కొత్తగా చూపించాలంటే వైలెన్స్ పెంచడమే సొల్యూషన్ కాదు. కథలో కొత్తదనం, పాత్రల్లో స్ట్రెంత్, డైలాగ్స్ పదును ఉంటే కూడా సినిమా స్పెషల్ గా నిలుస్తుంది.

హీరోను ఎలివేట్ చేయడానికి వైలెన్స్ కాకుండా పర్సనాలిటీ యూజ్ చేయవచ్చు. అందుకే మాస్ సినిమా అంటే పెద్ద ఫైట్లు, వైలెన్స్ మాత్రమే కాదు. ప్రేక్షకుడిని నవ్వించాలి, బాధ పెట్టాలి, ఉత్సాహపరచాలి. సినిమా అయిపోయాక కూడా కొన్ని సీన్స్ గుర్తుండిపోవాలి. ఇవన్నీ చేయగలిగితేనే ఆ సినిమా ప్రేక్షకులకు దగ్గరవుతుంది. వైలెన్స్ ఎంత ఎక్కువగా ఉందనే దానికంటే, కథ ఎంత స్ట్రాంగ్ గా ఉందనేదే ఇంపార్టెంట్. ఆ డిఫరెన్స్ ను దర్శకులు గుర్తిస్తే మాస్ సినిమాలకు కొత్త అర్థం వస్తుంది.

Tags:    

Similar News