ప్రభాస్ ఆ క్యారెక్టర్ చేస్తే చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులు...
ప్రభాస్ ఇప్పటివరకు చాలా స్టైలిష్ క్యారెక్టర్ లను చేశాడు. అలాగే మాస్ ఎలివేషన్స్ తో కూడిన పాత్రల్లో కూడా తన నటన ప్రతిభను చూపించాడు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ ని సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. ఈ సినిమా ఇచ్చిన హై తో పాన్ ఇండియా సబ్జెక్ట్ లను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులందరిని మెపిస్తున్నాడు. తన ఎంటైర్ కెరియర్ లో డిఫరెంట్ పాత్రలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ని క్రియేట్ చేస్తున్న ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ సినిమాల కోసం ఇండియా వైడ్ గా ఉన్న అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండటం విశేషం...
ప్రభాస్ రైతు క్యారెక్టర్ లో కనిపిస్తే...
ప్రభాస్ ఇప్పటివరకు చాలా స్టైలిష్ క్యారెక్టర్ లను చేశాడు. అలాగే మాస్ ఎలివేషన్స్ తో కూడిన పాత్రల్లో కూడా తన నటన ప్రతిభను చూపించాడు. కానీ రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఫుల్ లెంత్ రైతు క్యారెక్టర్ లో ప్రభాస్ ఎప్పుడు కనిపించలేదు. అలాంటి పాత్రలో అతన్ని చూడాలని తన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ రైతుగా మారితే ఎలా ఉంటుంది. ఆయన రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేయగలిగితే తన ఎంటైర్ కెరియర్ లోనే ఆ పాత్ర కి చాలా ప్రాధాన్యత లభిస్తోంది. తనతో రూరల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయగలిగే కెపాసిటి ఉన్న దర్శకులు చాలామంది ఉన్నారు.
ప్రభాస్ కి సెట్ అయ్యే విధంగా క్యారెక్టర్ ను డిజైన్ చేసి ఆ పాత్రలో ప్రభాస్ ను నటింపజేస్తే అభిమానులు సైతం ఆనందపడుతారు... ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. కానీ ఈ మధ్యకాలంలో ఆయన చేసిన కల్కి 2898 AD, సలార్ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచినప్పటికి ఇండస్ట్రీ హిట్లు రావడం లేదు. కాబట్టి మరోసారి తన స్టామినా ఏంటో చూపించాల్సిన సమయమైతే ఆసన్నమైంది. ప్రభాస్ వైవిధ్యభరితమైన పాత్రల వైపు తను అడుగులు వేస్తే బాగుంటుందని విమర్శకులు సైతం భావిస్తున్నారు... ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న 'ఫౌజీ' మూవీ తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాబట్టి ఈ మూవీతో ఆయన మరోసారి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయగల్గుతాడా? లేదా అనేది చూడాలి...