సాయి దుర్గ తేజ్ SYG..ఇక అసలైన టాస్క్ స్టార్ట్..

సినిమా షూటింగ్ పూర్తయింది.. ఇప్పుడు అసలైన వర్క్ మొదలైంది! ఇప్పటి వరకు సెట్స్‌ లో హార్డ్ వర్క్ చేసిన యంగ్ హీరో సాయి దుర్గ తేజ్.. ఇక ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది.

Update: 2026-10-18 14:10 GMT

సినిమా షూటింగ్ పూర్తయింది.. ఇప్పుడు అసలైన వర్క్ మొదలైంది! ఇప్పటి వరకు సెట్స్‌ లో హార్డ్ వర్క్ చేసిన యంగ్ హీరో సాయి దుర్గ తేజ్.. ఇక ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. ఆయన కెరీర్‌ లోనే భారీ రేంజ్ లో తెరకెక్కుతున్న సంబరాల ఏటి గట్టు (SYG) షూటింగ్ కంప్లీట్ అయింది. దీంతో మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో స్పీడ్ పెంచింది.




 


నిజానికి సాయి దుర్గ తేజ్ ఆ సినిమా కోసం కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. డైరెక్టర్ రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఆ పీరియాడికల్ యాక్షన్ స్టోరీ కోసం ఆయన చాలా కాలం పాటు వర్క్ చేశారు. సాధారణ సినిమాలతో పోలిస్తే ఆ ప్రాజెక్ట్ కోసం ఎక్కువ సమయం కేటాయించారు. దాదాపు 160 రోజుల పాటు షూటింగ్ జరగడం చూస్తేనే సినిమా కోసం ఎంత కష్టపడ్డారో అర్థమవుతోంది. అదే సమయంలో సాయి దుర్గ తేజ్ నుంచి సినిమా వచ్చి చాలా గ్యాప్ వచ్చింది.

దీంతో ఆయన అభిమానులు కొత్త మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే SYGపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఎక్కువ కాలం తర్వాత సినిమా వస్తున్నప్పుడు ఫ్యాన్స్ అంచనాలు అందుకోవడం కూడా ముఖ్యమే. అందుకే కేవలం షూటింగ్ పూర్తి చేస్తే సరిపోదు. సినిమా స్టోరీ, సాయి దుర్గ తేజ్ రోల్, యాక్షన్ సీన్స్ పై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెంచేలా ప్రమోట్ చేయాలి. ముఖ్యంగా ఆయన మేకోవర్ ను ప్రేక్షకులకు మరింత దగ్గరగా తీసుకెళ్లాలి.

ఇక స్వాతంత్ర్య ఉద్యమ కాలం నాటి పరిస్థితుల బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీలో నీటి కోసం ఇబ్బందులు పడే ప్రజల కష్టాలు, వారిపై జరిగే అన్యాయాలు మెయిన్ గా ఉండనున్నాయి. పాలకుడిని ఎదిరించి ప్రజలకు రిలీఫ్ ఇచ్చేందుకు పోరాడే యువకుడి కథగా సినిమాను రూపొందిస్తున్నారు. కేవలం పోరాటాలు, భారీ సీన్స్ కాకుండా.. ప్రజల కష్టాలు, వారి కోసం నిలబడే లీడర్ ఎమోషన్స్ సినిమాలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్న ఆ మూవీకి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. హనుమాన్ తో భారీ విజయాన్ని అందుకున్న ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఆ సక్సెస్ తర్వాత వస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ కావడంతో నిర్మాతలకు కూడా సంబరాల ఏటి గట్టు ఇంపార్టెంట్ మూవీనే. జనవరి 12న సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని మూవీ టీమ్ నిర్ణయించింది. అంటే రిలీజ్ కు ఇంకా చాలా టైం ఉంది. ఆ సమయాన్ని ప్రమోషన్స్ కోసం సరిగ్గా వాడుకోవాల్సి ఉంటుంది.

టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై ఇంకా ఇంట్రెస్ట్ పెంచాలి. సినిమాలో విషయం ఉందనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించాలి. సంక్రాంతి బరిలో నిలవడం, భారీ స్థాయిలో తెరకెక్కడం SYGకు కలిసొచ్చే ఎలిమెంట్స్. కానీ పండుగ సమయంలో పోటీ కూడా గట్టిగా ఉంటుంది. అందుకే చిన్న బ్రేక్ తర్వాత వస్తున్న సాయి దుర్గ తేజ్.. ఇప్పుడు అంచనాలు పెంచడమే పెద్ద టాస్క్. దీన్ని ఎలా డీల్ చేస్తారో.. ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News