దుల్కర్.. ఇకపై ఆ విషయం మర్చిపోతామేమో..

నిజానికి ఒక హీరోకు వేరే లాంగ్వేజ్ లో గుర్తింపు రావడం వేరు.. కానీ అక్కడి ప్రేక్షకుల్లో ఒకరిగా కలిసిపోవడం వేరు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ సెకెండ్ స్టేజ్ కు చేరుకున్నట్లు కనిపిస్తోంది.

Update: 2026-10-18 16:30 GMT

ఒకప్పుడు వేరే లాంగ్వేజ్ హీరోగా పరిచయమైన నటుడు.. ఇప్పుడు మన హీరో అనే ఫీలింగ్ సొంతం చేసుకుంటే అది మామూలు విషయం కాదు. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఆయన సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకుల్లో ఫుల్ ఇంట్రెస్ట్ కనిపిస్తుండడం విశేషం. స్టోరీ నచ్చితే చాలు.. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఆదరిస్తామని మన ప్రేక్షకులు చాలాసార్లు నిరూపించారు. దుల్కర్ సినిమాల విషయంలోనూ అదే కనిపిస్తోంది.

నిజానికి ఒక హీరోకు వేరే లాంగ్వేజ్ లో గుర్తింపు రావడం వేరు.. కానీ అక్కడి ప్రేక్షకుల్లో ఒకరిగా కలిసిపోవడం వేరు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ సెకెండ్ స్టేజ్ కు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన నటించిన సినిమాల్లో స్టోరీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, రోల్స్ లో కూడా అంతే కొత్తదనం కనిపిస్తుంది. అందుకే తెలుగు ఆడియన్స్ ఆయనను స్పెషల్ గా చూస్తున్నారు. ఇక్కడి స్టార్ హీరోలతో సమానంగా ఆయన సినిమాల గురించి డిస్కస్ చేసుకోవడం కూడా కామన్ అయిపోయింది.

అయితే మాలీవుడ్ మూవీస్ కు మంచి కథలే స్ట్రెంత్ అనే గుర్తింపు ఉంది. అలాంటి ఇండస్ట్రీ నుంచి వచ్చిన దుల్కర్.. తెలుగులో మాత్రం మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. టాలీవుడ్ లో వరుసగా కొత్త ఛాన్సులు అందుకుంటున్నారు. అవి కూడా ఆకట్టుకునే స్టోరీస్ తో రూపొందే సినిమాల్లోనే.. ఇక దుల్కర్‌ కు ఆ గుర్తింపు రావడానికి ఆయన సెలెక్ట్ చేసుకున్న సినిమాలే కాదు.. తెలుగు ప్రేక్షకులతో కలిసిపోయే పర్సనాలిటీ కూడా ఓ కారణమే.

తెలుగు మాట్లాడటానికి, తన రోల్స్ కు స్వయంగా డబ్బింగ్ చెప్పడానికి దుల్కర్ సల్మాన్ ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంతో సిల్వర్ స్క్రీన్ పై ఆయన యాక్టింగ్ ను వేరే వాళ్ల డబ్బింగ్ తో ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రేక్షకులు నేరుగా ఆస్వాదించగలుగుతున్నారు. ఒక నటుడు మరో భాషలో మంచి గుర్తింపు సంపాదించుకోవాలంటే ఇలాంటి ప్రయత్నాలు ఎంత ముఖ్యమో ఆయన జర్నీ చెబుతోంది.

ఇప్పుడు ఆకాశంలో ఒక తార మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు దుల్కర్ సల్మాన్. ఆ సినిమా కూడా ఆయనకు మరో మంచి విజయాన్ని అందించేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. నిజంగా ఆ మూవీ కూడా విజయం సాధిస్తే తెలుగు సినిమాల్లో ఆయనకు ఉన్న గుర్తింపు మరింత స్ట్రాంగ్ గా మారుతుంది. ఇక్కడి ప్రేక్షకులకు ఆయన మరింత దగ్గరవుతారు.

అలా దుల్కర్ సల్మాన్ జర్నీ చూస్తుంటే ఒక విషయం అర్థమవుతోంది. ఏ ఇండస్ట్రీకి చెందిన హీరో అన్నదాని కంటే.. ఎలాంటి స్టోరీలు చేస్తున్నారన్నదే ప్రేక్షకులకు ముఖ్యం. మంచి సినిమాలు ఇస్తే లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఆదరిస్తారు. దుల్కర్‌ కు తెలుగులో వస్తున్న రెస్పాన్స్ కూడా అదే చెబుతోంది. ఇకపై ఆయనను మాలీవుడ్ హీరోగా అన్న విషయం మర్చిపోయే రోజులు వచ్చినా కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Tags:    

Similar News