'మహారాజ' ఇంపాక్ట్.. 'మోస్ట్ వాంటెడ్ విలన్'గా మారేలా ఉన్నారే..
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విలన్ అంటే భయంకరంగా, గట్టి వాయిస్ ఉండాలనే అభిప్రాయం ఉండేది.
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విలన్ అంటే భయంకరంగా, గట్టి వాయిస్ ఉండాలనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. విలన్ ఎలా కనిపిస్తున్నాడనే దానికంటే.. తన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నారనేదే మెయిన్ గా మారింది. దీనికి ఎగ్జాంపుల్ గా బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ ను చెప్పుకోవచ్చు. 'మహారాజ' సినిమాలో ఆయన చూపించిన విలనిజం ఇప్పుడు తెలుగు సినిమాల్లోనూ కొత్త ఛాన్సులు వచ్చేలా చేస్తోంది.
విజయ్ సేతుపతి హీరోగా నటించిన తమిళ సినిమా 'మహారాజ'లో అనురాగ్ కశ్యప్ విలన్ గా కనిపించారు. ఆ సినిమాలో ఆయన యాక్టింగ్ తో ఓ రేంజ్ లో మెప్పించారు. పెద్దగా హడావుడి చేయకుండా, తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో రోల్ కు స్ట్రెంత్ తీసుకొచ్చారు. దీంతో విలన్ రోల్ ను కూడా కొత్తగా చూపించవచ్చని ఆయన ప్రూవ్ చేశారు. ఆ సినిమా తర్వాత అనురాగ్ కశ్యప్ గురించి సౌత్ లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఆయనకు వరుస అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన డెకాయిట్ లో ఇన్స్పెక్టర్ స్వామి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కాకా సినిమాలో విలన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఆ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ కూడా చేశారు. అయితే ఇప్పుడు బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలోనూ ఆయన విలన్ గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.
బాలయ్య దాదా మూవీ తర్వాత ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుండగా.. ఇప్పుడు అనురాగ్ కశ్యప్ యాక్ట్ చేస్తారన్న వార్త ఫ్యాన్స్ లో హైప్ ను పెంచుతోంది. ఇంకా మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా.. త్వరలోనే వస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే అనురాగ్ కశ్యప్ కు తెలుగులో మంచి అవకాశాలు వచ్చినట్లే. ఎందుకంటే చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సినిమాల్లో విలన్ గా నటించడమంటే మామూలు విషయం కాదు.
మాగ్జిమమ్ ఆ సినిమాల్లో విలన్ రోల్స్ కు కచ్చితంగా స్కోప్ ఉంటుంది. అయితే హీరోతో పోటీ పడటమే కాకుండా, స్టోరీలో అనురాగ్ కశ్యప్ తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి. అలాంటి పాత్రలు దక్కితే.. ఇక తిరుగుండదు. అదే సమయంలో తన యాక్టింగ్ తో ఇంకా మెప్పిస్తే.. తెలుగు డైరెక్టర్స్ ఫోకస్ కచ్చితంగా ఆయనపై పడుతుంది. దీంతో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారే ఛాన్స్ ఉంటుందనే చెప్పాలి.
ఇక తెలుగు సినిమాల్లో విలన్ల సెలెక్షన్ మారుతోంది. యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిని దర్శకులు ఎంచుకుంటున్నారు. విలన్ పాత్రలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అందుకే యాక్టింగ్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే వారిపై దర్శకులు దృష్టి పెడుతున్నారు. ఆ విషయంలో అనురాగ్ కశ్యప్ కచ్చితంగా టాప్ లో ఉంటారు. మరి ఆయన అప్ కమింగ్ మూవీస్ తో ఎలా మెప్పిస్తారో.. ఎలాంటి హిట్స్ అందుకుంటారో.. ఎన్ని ఛాన్సులు అందుకుంటారో వేచి చూడాలి.