కొత్త మూవీ.. మహేష్ మారిపోయాడు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటేనే తక్కువ ప్రమోషన్లు.. సినిమా రిలీజ్ కు ముందు తక్కువ ఇంటర్వ్యూలు, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే ఆయన తన మూవీ ప్రమోషన్స్ ను కంప్లీట్ చేస్తారనే పేరుంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటేనే తక్కువ ప్రమోషన్లు.. సినిమా రిలీజ్ కు ముందు తక్కువ ఇంటర్వ్యూలు, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే ఆయన తన మూవీ ప్రమోషన్స్ ను కంప్లీట్ చేస్తారనే పేరుంది. మిగతా హీరోల్లా వరుసగా మీడియా మీట్స్ లో పాల్గొనడం, వేర్వేరు సిటీస్ తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేయడం, సోషల్ మీడియాలో సందడి చేయడం పెద్దగా అలవాటు లేదు. కొంతకాలంగా మహేష్ బాబు అలాగే చేస్తున్నారు.
కానీ ఇప్పుడు తన కొత్త మూవీ.. దర్శకధీరుడు రాజమౌళితో చేస్తున్న వారణాసి సినిమా కోసం మాత్రం మహేష్ బాబు ఇప్పుడు తన పద్ధతిని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ ప్రమోషన్లకు పెద్దగా సమయం కేటాయించని ఆయన.. ఈసారి నెలల ముందే ప్రమోషనల్ ఈవెంట్స్ కు రెడీ కావాల్సి వస్తోందట. నిజానికి ఆ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనేది మూవీ టీమ్ బిగ్ టార్గెట్.
అందుకే ప్రమోషన్స్ కు సంబంధించి ఇప్పటికే స్పెషల్ ప్లాన్ ను మేకర్స్ రెడీ చేసినట్లు సమాచారం. ఏయే నెలల్లో, ఏయే తేదీల్లో అందుబాటులో ఉండాలనే వివరాలతో మహేష్ కు ఓ షెడ్యూల్ అందినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. జనవరి 2027 నుంచి ఏప్రిల్ 7వ తేదీ సినిమా విడుదలయ్యే వరకు ఆయన ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం కోసం కంప్లీట్ గా టైమ్ కేటాయించాల్సి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
దీంతో సాధారణంగా సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు మాత్రమే ప్రమోషన్స్ లో కనిపించే మహేష్ బాబు.. ఈసారి దేశంలోని మెయిన్ సిటీస్ తో పాటు ఇంటర్నేషనల్ స్టేజెస్ పై సందడి చేయాల్సి రావచ్చు. ముఖ్యంగా వరల్డ్ వైడ్ గా సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేయాలంటే హీరో కూడా ప్రమోషన్స్ లో చురుగ్గా ఉండటం అవసరం. అందుకే తన ఎప్పుడూ ఫాలో ప్రాసెస్ ను పక్కన పెట్టి, ప్రమోషన్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఇక రాజమౌళి సినిమాల మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో ఇండియన్ సినిమాకు ఇంటర్నేషనల్ రేంజ్ లో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఆయన.. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాను కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులకు చేరువ చేయాలనుకుంటున్నారు. అందుకే ప్రమోషన్స్ ను ముందుగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే మహేష్ ప్రమోషనల్ షెడ్యూల్ కు సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్ గా తెలియాల్సి ఉంది. అలా వారణాసి కోసం మహేష్ బాబు తన పాత పద్ధతిని మార్చుకుంటున్నారనే వార్త అభిమానుల్లో ఇంట్రెస్ట్ పెంచుతోంది. ఇన్నాళ్లూ స్క్రీన్ పై తన ప్రేక్షకులను ఆకట్టుకున్న సూపర్ స్టార్.. ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కు ఎక్కువ సమయం కేటాయించబోతున్నారన్న మాట. అదే జరిగితే.. మహేష్ బాబు తన క్రేజ్ ను వరల్డ్ వైడ్ గా పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ విషయంలో కూడా మారిపోయినట్లే అవుతుంది.