తప్పుగా చెప్పింటే క్షమించండి.. పెళ్లి కాకుండానే పిల్లలు కనడం పై ట్రోల్స్.. నరేష్ రియాక్షన్!
ఈ నేపథ్యంలోనే తాజాగా క్రేజీ కళ్యాణం సక్సెస్ మీట్ లో భాగంగా తాము మాట్లాడిన మాటలకు అటు అనుపమ ఇటు నరేష్ ఇద్దరూ వివరణ ఇచ్చారు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న వీకే నరేష్ తాజాగా నటించిన చిత్రం క్రేజీ కళ్యాణం. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నరేష్ మాట్లాడుతూ.." పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు పిల్లల్ని కనండి" అంటూ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అదే ఈవెంట్లో అదే ప్రశ్న అనుపమాకు ఎదురవగా.. "పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు కానీ పిల్లల్ని మాత్రం కనండి. తనకి కూడా పెళ్లి కాకుండానే పిల్లలను కనాలని ఉంది. అది దత్తత తీసుకోవడమో లేదా ఐవీఎఫ్ ద్వారానో సాధ్యమవుతుంది కదా" అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.
అయితే ఆమె స్పష్టమైన వివరణ ఇచ్చినప్పటికీ కొంతమంది ఆకతాయిలు కేవలం కొన్ని పదాల బిట్స్ ను మాత్రమే తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ట్రోల్స్ గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా క్రేజీ కళ్యాణం సక్సెస్ మీట్ లో భాగంగా తాము మాట్లాడిన మాటలకు అటు అనుపమ ఇటు నరేష్ ఇద్దరూ వివరణ ఇచ్చారు. అంతేకాదు నరేష్ మాట్లాడుతూ.." నేను మాట్లాడింది తప్పుగా అనిపిస్తే క్షమించండి" అంటూ బహిరంగ క్షమాపణలు కూడా కోరారు మరి ఆయన ఏమన్నారో ఎప్పుడు చూద్దాం..
క్రేజీ కల్యాణం సక్సెస్ మీట్ లో భాగంగా అనుపమ మాట్లాడుతూ.. "మొన్న ఒక ఈవెంట్లో నరేష్ గారు అన్నారు కదా.. పెళ్లి కాకపోయినా పర్లేదు పిల్లల్ని కనండి అని.. అది అందరం కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఎవరో అందులో సగం బిట్ తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేసేసారు. చాలా తప్పుగా వెళ్ళిపోయింది. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటంటే.. నరేష్ గారు అలా చెప్పారు కదా.. దానికి మీ ఒపీనియన్ ఏంటి ?అని అడిగారు.. పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. కానీ పెళ్లి చేసుకోకపోయినా మీరు పిల్లల్ని కనొచ్చు. అంటే పిల్లలు కావాలని కొంతమంది పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. అంటే పిల్లల్ని కనేటప్పుడు వాళ్లకి ఒక సంతోషకరమైన వాతావరణాన్ని ఇవ్వగలగాలి అని నేను అనుకున్నాను. పెళ్లి చేసుకోవద్దు అని నేను ఎక్కడ చెప్పలేదు.. నా ఒపీనియన్ నేను చెప్పాను" అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది అనుపమ.
ఈ వైరల్ న్యూస్ పై నరేష్ మాట్లాడుతూ.. "నేను ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించండి.. ప్రపంచంలో జనాభా తగ్గిపోతోంది. పెళ్లిళ్లు చేసుకోవడానికి భయపడుతున్నారు. లివింగ్ రిలేషన్షిప్స్ పెరుగుతున్నాయి. పెళ్లి చేసుకున్నా.. లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నా.. పిల్లల్ని మాత్రం కనండి. సృష్టి ఆగిపోకూడదు అని మాత్రమే చెప్పాను. ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించండి. ఇంతకుమించి దురుద్దేశం లేదు" అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకు వచ్చారు. మొత్తానికైతే పూర్తిగా వినకుండా సగం బిట్టు తీసి ట్రోల్స్ చేస్తున్న వారికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు అనుపమ, నరేష్.