'ఇండస్ట్రీ పెద్దల హామీ.. కానీ పూరి నుంచి కాల్ వస్తే కదా'
సినిమా హిట్ అయితే లాభాలు.. ఫ్లాప్ అయితే నష్టాలు. మూవీ బిజినెస్ లో ఇది కామనే. కానీ సినిమా వల్ల నష్టపోయినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆదుకుంటామని చెప్పి, ఆ తర్వాత రెస్పాన్స్ లేకపోతే ఎలా ఉంటుంది.
సినిమా హిట్ అయితే లాభాలు.. ఫ్లాప్ అయితే నష్టాలు. మూవీ బిజినెస్ లో ఇది కామనే. కానీ సినిమా వల్ల నష్టపోయినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆదుకుంటామని చెప్పి, ఆ తర్వాత రెస్పాన్స్ లేకపోతే ఎలా ఉంటుంది. ఇప్పుడు దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీ కౌర్ విషయంలో ఇలాంటి ఆరోపణలే కొన్నిరోజులుగా వైరల్ అవుతున్నాయి. హనుమాన్ కో ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి చేసిన రీసెంట్ కామెంట్స్ మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి.
రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆ వివాదానికి కారణం. మూవీ థియేట్రికల్ రైట్స్ ను తాము కొనుగోలు చేశామని, సినిమా ఫ్లాప్ కావడంతో భారీగా నష్టపోయామని చైతన్య రెడ్డి తెలిపారు. సుమారు రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు నష్టం వచ్చిందని.. అయితే ఆ నష్టం కంటే, ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్సే తమను ఎక్కువగా బాధపెట్టాయని ఆమె కామెంట్స్ బట్టి అర్థమవుతోంది.
సినిమా రిలీజ్ కు ముందు సమస్యలు ఎదురైనప్పుడు తాము డ్రాప్ అవ్వాలని అనుకున్నామని చైతన్య రెడ్డి చెప్పారు. అయితే పూరీ జగన్నాథ్, ఛార్మీ కాల్స్ చేసి సినిమా విడుదలకు సపోర్ట్ చేయాలని కోరినట్లు ఆరోపించారు. తాము వెనక్కి తగ్గితే పరిస్థితి మరింత కష్టమవుతుందని చెప్పి ఒప్పించారని ఆమె పేర్కొన్నారు. సినిమా విడుదలైన తర్వాత నష్టాల గురించి మాట్లాడేందుకు ప్రయత్నించినా సరైన రెస్పాన్స్ రాలేదట.
అ సమయంలోనే కొందరు ఇండస్ట్రీ పెద్దలు తమకు హామీ ఇచ్చినట్లు చైతన్య రెడ్డి చెప్పారు. పూరీ జగన్నాథ్ అన్యాయం చేసే వ్యక్తి కాదని వారు చెప్పినట్లు వెల్లడించారు. సినిమా ఫ్లాప్ అయిన సమయంలో ఆయన్ను మరింత ఇబ్బంది పెట్టడం సరికాదని, ఏం జరిగిందో తాము మాట్లాడతామని హామీ ఇచ్చారట. నష్టపోయిన వారి బాధ కూడా అర్థం చేసుకోవాలని, సినిమా అనేది చిన్న ప్రపంచమని చెప్పినట్లు వివరించారు.
అంతేకాదు, కొన్ని రోజుల్లో పూరీ నుంచి ఫోన్ వస్తుందని, అప్పటివరకు వెయిట్ చేయాలని ఇండస్ట్రీ పెద్దలు సూచించినట్లు ఆమె తెలిపారు. నష్టానికి తగిన సాయం అందేలా చూస్తారని చెప్పినట్లు వెల్లడించిన ఆమె.. అయితే ఆ హామీ ఇచ్చిన తర్వాత కూడా పూరీ నుంచి ఫోన్ రాలేదని చైతన్య రెడ్డి ఆరోపించారు. ఛార్మీకి మెసేజ్ చేసినా తనను బ్లాక్ చేసినట్లు చెప్పారు. దీంతో వారి ప్లాబ్లమ్ క్లియర్ అవ్వలేదని అర్థమవుతోంది.
ఆ తర్వాత నిరంజన్ రెడ్డి అమెరికా నుంచి వచ్చిన సమయంలో ఆ విషయంపై మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు చెప్పిన చైతన్య.. తాను వస్తే పూరీ మాట్లాడలేరని ఛార్మీ చెప్పినట్లు ఆమె ఆరోపించారు. నష్టాన్ని కవర్ చేసేలా మరో రెండు సినిమాలు తమ సంస్థకు చేసి పెట్టాలని, మంచి ఛాన్స్ ఇచ్చామని వివరించారు. కానీ అలా జరగలేదట. అయితే ఆ ఆరోపణలపై పూరీ- ఛార్మీ నుంచి రెస్పాన్స్ రావాల్సి ఉంది. అప్పుడే కంప్లీట్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.