కం*డోమ్ ఎలా వేసుకోవాలో తెలియడం లేదు.. అందుకే సినిమాలో చూపించాం

గీతానంద్- మిత్రా శర్మ లీడ్ రోల్లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ ‌‌‌‌‌‌‌టైనర్ 'వర్జిన్ బాయ్స్'. దర్శకుడు దయానంద్ ఈ సినిమా తెరకెక్కించారు.;

Update: 2025-07-09 10:30 GMT

గీతానంద్- మిత్రా శర్మ లీడ్ రోల్లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ ‌‌‌‌‌‌‌టైనర్ 'వర్జిన్ బాయ్స్'. దర్శకుడు దయానంద్ ఈ సినిమా తెరకెక్కించారు. రాజా దరపునేని నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇది జూలై 11న థియేటర్ లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో నిర్మాత రాజా దరపునేని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ట్రైలర్ లో కం*డోమ్ సీన్ ఒకటి చూపించారు. ఆ సీన్ గురించి మీడియా అడగ్గా, రాజా దరపునేని సమాధానం ఇచ్చారు. ఈ రోజుల్లో కొంతమంది అది ఎలా ధరించాలో కన్ ఫ్యూజ్ అవుతున్నారని, అందుకే సినిమాలో ఆ సీన్ చూపించాల్సి వచ్చిందని టీమ్ పేర్కొంది.

'ఈ సినిమాలో ఆ సీన్ అవసరమే. సెన్సార్ వాళ్లు కూడా ఇదే అన్నారు. వాళ్లకూ చెప్పాం. ఈ సీన్కు ముందు ఓ డైలాగ్ ఉంటుంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో దాని గురించి లేదు. చాలా చోట్ల తప్పులు జరుగుతున్నాయి. బాత్రూంల్లో పసికందులను వదిలేస్తున్నారు. యూత్ ఆ మార్గంలో వెళ్తోంది. అందుకే సెటైరికల్గా ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చాం' అని హీరో రిప్లై ఇచ్చారు.

వెంటనే దీనికి నిర్మాత రాజా దరపునేని స్పందిస్తూ.. 'అరటిపండుకు కం*డోమ్ పెట్టే సీన్ అవసరమా? అని అడిగారు కదా! ప్రభుత్వాలు నిరోధ్ వాడాలి అని చెబుతున్నాయి. కానీ అది ఎలా వాడాలో చూపించే వీడియో నేనెక్కడా చూడలేదు. ఈ సిచ్యువేషన్ చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. పీక్స్ టైమ్ లో కం*డోమ్ చించిన తర్వాత అది ఎలా వేసుకోవాలో తెలియక కన్ ఫ్యూజన్ లో దాంట్లో ఉండే ఆయిల్ డ్రై అయిపోతుంది. ఈ లోగా చల్లబడిపోతారు' అని చెప్పుకొచ్చారు.

దీంతో ప్రెస్ మీట్ మొత్తం నవ్వులే నవ్వులు. అయితే యూత్ లో ఓ క్లారిటీ ఇచ్చేందుకే ఈ సీన్ సినిమాలో పెట్టినట్లు మేకర్స్ చెప్పుకొచ్చారు. కాగా, ఇది కంప్లీట్ యూత్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. కుర్రాళ్ల కాలేజీ లైఫ్, అమ్మాయిలతో లవ్ స్టోరీలు పూర్తిగా ఈ సంఘటనల ఆధారంగానే సినిమా తీశారు. సినిమాలో అనేక సర్ప్రైజ్ లు ఉన్నాయని, యుత్ కు బాగా కనెక్ట్ అయి సినిమా మంచి విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

Tags:    

Similar News