వేణు మల్టీస్టారర్.. డిస్కషన్స్ అంతా ఆ స్టార్ గురించే..?
సినిమా దర్శకుడు సాయిలు వేణు దగ్గర పనిచేశాడు. అందుకే ఆయన కథను ప్రపంచానికి చూపించే అవకాశం ఇచ్చాడు.;
నీది నాది ఒకే కథ సినిమాతో డైరెక్టర్ గా తన మార్క్ వేసుకున్న వేణు ఊడుగుల తన రెండో ప్రయత్నంగా విరాటపర్వం అనే సినిమాతో వచ్చాడు. రానా, సాయి పల్లవి కలిసి నటించిన ఈ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వలేదు కానీ సినిమా మాత్రం వేణుకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఐతే ఈ డైరెక్టర్ మూడో సినిమా ఎప్పుడు 3 ఏళ్లుగా ఏం చేస్తున్నాడన్న చర్చ నడుస్తుంది. లేటెస్ట్ గా రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో మరోసారి సర్ ప్రైజ్ చేశాడు వేణు. ఆ సినిమాకు వెనక ఉండి నడిపించింది ఆయనే.
రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు వేణు కాంట్రిబ్యూషన్..
సినిమా దర్శకుడు సాయిలు వేణు దగ్గర పనిచేశాడు. అందుకే ఆయన కథను ప్రపంచానికి చూపించే అవకాశం ఇచ్చాడు. రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు వేణు కాంట్రిబ్యూషన్ ఇంప్రెస్ చేస్తుంది. ఐతే వేణు ఈ సినిమా ప్రమోషన్స్ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ డీటైల్స్ చెప్పారు. నెక్స్ట్ తానొక మల్టీస్టారర్ కథ చేస్తున్నట్టు చెప్పారు వేణు. అసలైతే తెలుగు సీనియర్ హీరో ఒకరు.. యువ హీరో మరొకరు ఇలా ఈ మల్టీస్టారర్ ప్లాన్ చేసుకున్నాడట వేణు.
ఆ సీనియర్ హీరోకి కథ నచ్చినా ఎందుకో ఫైనల్ డిస్కషన్స్ లో ఆయన కాదన్నారట. ఐతే ఇప్పుడు వేణు ఊడుగుల ఆ కథను మోహన్ లాల్ కి వినిపించే ప్రయత్నాల్లో ఉన్నారట. మలయాళంలో తన మార్క్ సినిమాలు చేస్తూ అదరగొట్టేస్తున్న మోహన్ లాల్ ఇతర భాషల ఆఫర్లు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా తెలుగులో ఆయన జనతా గ్యారేజ్, మనమంతా రీసెంట్ గా కన్నప్పలో క్యామియో రోల్ చేసి మెప్పించారు.
టాలెంటెడ్ డైరెక్టర్ కి వర్సటైల్ యాక్టర్..
ఇప్పుడు వేణు ఊడుగుల సినిమాకు ఓకే చెబితే మాత్రం టాలెంటెడ్ డైరెక్టర్ కి వర్సటైల్ యాక్టర్ దొరికినట్టే అవుతుంది. ఇక ఈ సినిమాలో మరో యాక్టర్ గా శ్రీకాంత్ తనయుడు రోషన్ ని తీసుకుంటున్నారట. రోషన్ ఛాంపియన్ తర్వాత సినిమా ఇదే అయ్యే ఛాన్స్ ఉంది. ఐతే ఆమధ్య వేణు ఊడుగుల వెంకటేష్ తో సినిమా చేయాలని ఒక స్టోరీ కూడా చెప్పాడన్న టాక్ వచ్చింది. ఒకవేళ ఈ మల్టీస్టారర్ కథలో కూడా వెంకటేష్ మొదటి ఆప్షన్ అయ్యి ఉండొచ్చని కొందరి కామెంట్.
ఐతే డిస్కషన్ లో ఉన్న సినిమా కాబట్టి అలాంటి ఒపీనియన్ చెప్పడం కష్టం. వేణు విషయానికి వస్తే ఈ డైరెక్టర్ సరైన ఫోకస్ చేస్తే మాత్రం కచ్చితంగా తెలుగులో స్టార్ డైరెక్టర్ గా అదరగొట్టే ఛాన్స్ ఉంటుంది. విరాటపర్వం తర్వాత గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ ఇక మీదట వరుస సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు.