విల‌న్లే కానీ హీరోల కంటే ఎక్కువ ప్ర‌శంస‌లు!

2025లో బాక్సాఫీస్ వ‌ద్ద ఎన్నో భారీ బ‌డ్జెట్ సినిమాలు రిలీజ‌య్యాయి. వాటిలో కొన్ని సినిమాలు స‌క్సెస్ అయితే మ‌రికొన్ని సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి.;

Update: 2026-01-01 12:51 GMT

2025లో బాక్సాఫీస్ వ‌ద్ద ఎన్నో భారీ బ‌డ్జెట్ సినిమాలు రిలీజ‌య్యాయి. వాటిలో కొన్ని సినిమాలు స‌క్సెస్ అయితే మ‌రికొన్ని సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి. అయితే 2025లో వ‌చ్చిన సినిమాల్లో విల‌న్లుగా న‌టించిన న‌టులు త‌మ‌దైన ముద్ర వేసుకుని, సినిమాల్లో హీరోలుగా న‌టించిన వారి కంటే గొప్ప న‌ట‌న‌ను క‌న‌బ‌రిచి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నారు.

దురంధ‌ర్ మూవీతో అక్ష‌య్ ఖ‌న్నాకు మంచి గుర్తింపు

ఈ ప్ర‌తినాయ‌కుల యాక్టింగ్ ఆడియ‌న్స్ పై ఎంతో బ‌ల‌మైన ముద్ర‌ను వేయ‌డంతో ఇక‌పై డైరెక్ట‌ర్లు ఇలాంటి విల‌న్ రోల్స్ నే రాయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. విల‌న్ రోల్స్ స్ట్రాంగ్ గా ఉంటేనే అందులోని ప్ర‌ధాన న‌టుల యాక్టింగ్ మ‌రింత ఎలివేట్ అయ్యే అవ‌కాశముంటుంద‌ని ఆడియ‌న్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. అందులో భాగంగానే దురంధ‌ర్ మూవీలో అక్ష‌య్ ఖ‌న్నా విల‌న్ గా న‌టించ‌గా, ఆయ‌న క్యారెక్ట‌ర్, అందులో అత‌ని యాక్టింగ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. సినిమాలో న‌టించిన అంద‌రినీ అత‌ని యాక్టింగ్ డామినేట్ చేసింద‌ని అంద‌రూ అక్ష‌య్ ఖ‌న్నాను మెచ్చుకున్నారు.

థామాలో అద‌ర‌గొట్టిన న‌వాజుద్దీన్ సిద్దిఖీ

ఇక అదే సినిమాలో అర్జున్ రాంపాల్ కూడా న‌టించ‌గా, అత‌ని న‌ట‌న‌కు కూడా చాలా మంచి మార్కులే ప‌డ్డాయి. చాలా కాలంగా పెద్ద‌గా లైమ్ లైట లో లేని అర్జున్ రాంపాల్ కు ఈ సినిమా చాలా పెద్ద ఊర‌ట‌ను అందించింది. ఇక థామా సినిమాలో న‌వాజుద్దీన్ సిద్దిఖీ కూడా త‌న యాక్టింగ్ తో ఆడియ‌న్స్ ను బాగా ఇంప్రెస్ చేశారు. జాట్ మూవీలో ర‌ణ‌దీప్ హుడా త‌న న‌ట‌న‌తో ప్రేక్షకుల్ని మెప్పించారు.

జాట్ మూవీలో స‌న్నీ డియోల్ తో పోటీ ప‌డి మ‌రీ ర‌ణ‌దీప్ హుడా న‌టించార‌ని అంద‌రూ అభిప్రాయ‌ప‌డ్డారు. మొత్తానికి ఈ యాక్ట‌ర్లంద‌రూ క‌లిసి 2025ను మ‌రింత ఎంట‌ర్టైనింగ్ గా మార్చ‌డంతో పాటూ విల‌న్ క్యారెక్ట‌ర్లంటే ఇలా ఉండాల‌ని ప్రూవ్ చేశారు. ఇవ‌న్నీ చూశాక ఆడియ‌న్స్ కూడా 2026లో ఇలాంటి పాత్ర‌లు మ‌రిన్ని వ‌స్తాయని ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News