మాజీలతో స్నేహం రెడ్ ఫ్లాగ్ లాంటింది!
మాజీ ప్రియులు లేదా ప్రియురాళ్లతో స్నేహం కొనసాగించడం తమకు సరిపడదని.. ఇద్దరూ ఈ విషయంలో ఒకే నిర్ణయంతో ఉన్నామన్నారు.
బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే వ్యక్తిగత సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. మాజీ భాగస్వాములతో స్నేహం కొనసాగించడం అనేది ఒక రెడ్ ఫ్లాగ్ అని.. అలాంటి సంబంధాల వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తన వైవాహిక జీవితం .. భాగస్వామితో ఉన్న అవగాహనపై ఆయన పలు ఆసక్తికరమై విషయాలను వెల్లడించారు. విక్రాంత్ మాస్సే భార్య శీతల్ ఠాకూర్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. తమ ఇద్దరి మధ్య అభిప్రాయాల విషయంలో పూర్తి స్పష్టత ఉందని అందుకే తమ గతాన్ని గౌరవంగానే వదిలేశామన్నారు.
మాజీ ప్రియులు లేదా ప్రియురాళ్లతో స్నేహం కొనసాగించడం తమకు సరిపడదని.. ఇద్దరూ ఈ విషయంలో ఒకే నిర్ణయంతో ఉన్నామన్నారు. ఒక బంధంలో నమ్మకం అనేది అత్యంత కీలకమని విక్రాంత్ నొక్కి చెప్పారు. భాగస్వాములిద్దరూ ఒకరిపై ఒకరు పూర్తి నమ్మకంతో ఉన్నప్పుడు బయటి వ్యక్తులతో స్నేహాలు కొనసాగించాల్సిన అవసరం లేదన్నారు. ఇది తమ వ్యక్తిగతమైన ఎంపిక అని.. దీనివల్ల తమ వైవాహిక బంధం మరింత దృఢంగా మారుతుందని పేర్కొన్నారు. విక్రాంత్ భార్య శీతల్ ఠాకూర్ కూడా ఆయన అభిప్రాయాలను సమర్థించారు.
తమ మధ్య ఉన్న గౌరవం, స్వేచ్ఛ , నమ్మకం వల్లే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం సులభమైందని తెలిపారు. గతాన్ని వదిలేసి ప్రస్తుత బంధంపై దృష్టి పెట్టడం ద్వారానే సంతోషకరమైన జీవితాన్ని గడుపుతామని దంపతులు నమ్ముతున్నారు. ప్రస్తుత కాలంలో ఎక్స్ లతో స్నేహం కొనసాగించడం సాధారణమైపోయిందని అనిపిస్తున్నప్పటికీ అది ప్రతి ఒక్కరికీ వర్తించదని విక్రాంత్ వ్యాఖ్యానించారు. వ్యక్తుల ఆలోచనా దృక్పథం బట్టి సంబంధాలు ఉంటాయని, ఏది సరైనదో ఏది కాదో నిర్ణయించుకునే హక్కు ఆయా వ్యక్తులకే ఉంటుందన్నారు.
తమకు మాత్రం పాత సంబంధాలతో సంబంధం లేకుండా జీవించడమే ప్రశాంతతను ఇస్తుందని అభిప్రా యపడ్డారు. విక్రాంత్ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఇతర జంటలకు కొత్త కోణాన్ని పరిచయం చేశాయి. సంబంధాల విషయంలో ఎవరికి వారు సొంత సరిహద్దులను నిర్మించుకోవడం ఎంతో అవసరమని ఆయన వ్యాఖ్యల ద్వారా అర్దమవుతుంది. ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేయడం వల్ల అభిమానులకు కూడా వారి వ్యక్తిగత జీవితాల గురించి ఒక అవగాహన కలుగుతుందని చెప్పొచ్చు.