థగ్ లైఫ్ లో ఆ స్టార్ ఎందుకు మిస్ అయ్యాడు..?

కమల్ థగ్ లైఫ్ సినిమాలో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ వరుస కమిట్మెంట్స్ వల్ల దుల్కర్ ఆ ఛాన్స్ వదులుకున్నాడట.;

Update: 2025-04-20 02:30 GMT
థగ్ లైఫ్ లో ఆ స్టార్ ఎందుకు మిస్ అయ్యాడు..?

పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలతో మణిరత్నం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని తెలిసిందే. తమిళ ప్రేక్షకులు ఆహా ఓహో అన్నా సరే మిగతా భాషల్లో మాత్రం ఆ సినిమాను లైట్ తీసుకున్నారు. పి.ఎస్ 1, పి.ఎస్ 2 లో విక్రమ్, రవి మోహన్, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ఇలా భారీ తారాగణం తో తెరకెక్కించారు. మణిరత్నం కాదు ఆ సినిమా మీద చియాన్ విక్రమ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. పి.ఎస్ 1 మిశ్రమ స్పందన తెచ్చుకున్నా పి.ఎస్ 2 టార్గెట్ రీచ్ అవుతుందని అనుకున్నాడు. కానీ అది వర్క్ అవుట్ అవ్వక్లేదు.

అందుకే మణిరత్నం లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్ ఆఫర్ ని కూడా విక్రం కాదన్నారని టాక్. పి.ఎస్ 2 సినిమా టైం లోనే విక్రం స్వయానా తనే మణి సర్ నెక్స్ట్ సినిమాలో కూడా తాను త్రిష నటిస్తున్నామని అన్నాడు. థగ్ లైఫ్ సినిమాలో విక్రమ్, త్రిషని తీసుకోవాలని అనుకున్నారు. ఐతే థగ్ లైఫ్ లో త్రిష కొనసాగింది కానీ విక్రం మిస్ అయ్యాడు. విక్రం ఎందుకు ఆ సినిమాని వదులుకున్నారు అన్నది రీజన్స్ తెలియదు.

మరోపక్క కమల్ హాసన్ లీడ్ రోల్ లో తెరక్కుతున్న థగ్ లైఫ్ లో జయం రవి అదే రవి మోహన్ ని కూడా తీసుకోవాలని అనుకోగా అతను కూడా పొన్నియిన్ సెల్వన్ రిజల్ట్ వల్ల అసంతృప్తి చెందడంతో థగ్ లైఫ్ ని కాదన్నాడట. అందుకే రవి మోహన్ వదులుకున్న ఆ ఛాన్స్ ని శింబు దక్కించుకున్నాడు. ఇలా థగ్ లైఫ్ లో అసలు మణిరత్నం అనుకున్న కాంబినేషన్ ఒకటైతే సినిమా మరొకరితో పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

కమల్ థగ్ లైఫ్ సినిమాలో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ వరుస కమిట్మెంట్స్ వల్ల దుల్కర్ ఆ ఛాన్స్ వదులుకున్నాడట. కమల్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉన్నా ప్రస్తుతం అది వదులుకోక తప్పలేదని దుల్కర్ భావించినట్టు తెలుస్తుంది. మొత్తానికి థగ్ లైఫ్ కాస్టింగ్ విషయంలో ఈ కాలిక్యులేషన్స్ అన్నీ జరిగాయి. ఐతే ఫైనల్ గా థగ్ లైఫ్ ని పూర్తి చేసిన మణిరత్నం సినిమాతో తన అదిరిపోయే కంబ్యాక్ ఇస్తారా లేదా అన్నది చూడాలి.

థంగ్ లైఫ్ మీద కమల్ మాత్రం సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రీసెంట్ గా ఆ సినిమా సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న కమల్ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుస్తుందని అన్నారు.

Tags:    

Similar News