• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లియో చుట్టూ మరో వివాదం

లియో చుట్టూ మరో వివాదం

| ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లియో. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న ఈ చిత్రం దసరాకి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది

By - Tupaki Desk
Update: 2023-10-06 07:54 GMT

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లియో. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న ఈ చిత్రం దసరాకి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ ట్రైలర్ ని మిశ్రమ స్పందన వస్తోంది. ముఖ్యంగా దళపతి అభిమానులు సైతం ట్రైలర్ పై పెదవివిరుస్తున్నారు.

హైఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యే సినిమా నుంచి ఇలాంటి ట్రైలర్ ఎక్స్ పెక్ట్ చేయలేదని ఆడియన్స్ నుంచి వినిపిస్తోన్న మాట. అయితే సోషల్ మీడియాలో లియో ట్రైలర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. ఇండియన్ డైరెక్టర్స్ చాలా మంది హాలీవుడ్ సినిమాల నుంచి ఇన్స్పైర్ అయ్యి కథలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు.

ఒక్కోసారి హాలీవుడ్ కథలని లేపేసి ప్రీమేక్ చేస్తారు. ఇప్పుడు లియో కూడా ప్రీమేక్ మూవీ అనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. హాలీవుడ్ లో వచ్చిన ది హిస్టరీ ఆఫ్ వైలెన్స్ మూవీనే లియోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించరని కామెంట్స్ చేస్తున్నాయి. ఆ సినిమా పోస్టర్ ని లియో పోస్టర్ పక్కన పెట్టి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ది హిస్టరీ ఆఫ్ వైలెన్స్ మూవీ హాలీవుడ్ లో 2005లో వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఒక కామన్ మెన్ అనుకోకుండా ఇద్దరు దొంగలని హత్య చేస్తాడు. అయితే అతనిని గ్యాంగ్ స్టార్ అని భావించి మాఫియా వాళ్ళు వెంటపడుతూ ఉంటారు. వారి నుంచి కుటుంబాన్ని కాపాడుకోవడానికి ముందు తప్పించుకొనే ప్రయత్నం చేస్తాడు.

అయితే ఎంత దూరం వెళ్ళిన ఆ మాఫియా వాళ్ళు తనని వెంటాడుతూ ఉండటంతో వారికి ఎదురుతిరిగి పోరాటం చేయడమే కాకుండా గ్యాంగ్ స్టార్ గా మారుతాడు. ఇంచుమించు ఇదే కథతో లియో మూవీ కూడా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. అయితే ప్రీమేక్ అయిన లోకేష్ కనగరాజ్ తన స్టైల్ జోడించి ఎలా ఈ చిత్రాన్ని ఆవిష్కరించాడు అనేది తెలియాల్సి ఉంది. విజయ్ యాంటీ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు లియో సినిమా ప్రీమేక్ అంటూ చేస్తోన్న ట్రోల్స్ పై చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి.

Tags:    
  • Leomovie 
  • Leotrailer 
  • Lokeshkanagaraj 
  • Vijaythalapathy 
  • Trisha 
  • Sanjaydutt 
  • Leofilm 
  • Ahistoryofviolence 
  • Tomstahl 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS