• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ హీరో చొరవతో విజయ్...

ఆ హీరో చొరవతో విజయ్ రూ.కోటి విరాళం..

| కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే సొంత పార్టీని ప్రారంభించిన ఈ హీరో

By - Tupaki Desk
Update: 2024-03-12 15:46 GMT

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే సొంత పార్టీని ప్రారంభించిన ఈ హీరో.. దేశంలో పలు అంశాలపై స్పందిస్తున్నారు. తమిళనాడులో ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే సైన్ చేసిన సినిమాలు పూర్తయ్యాక.. విజయ్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా అవతరించనున్నారు.

అయితే తన రాజకీయ భవిష్యత్ కోసం ఆచితూచి అడుగులేస్తున్నారు విజయ్. రాష్ట్రంలో కొన్ని మంచి పనులు చేస్తున్నారు. ఇటీవల తమిళనాడులో భారీ వర్షాలు కురవగా.. బాధితులకు సహాయం చేశారు. బియ్యం సహా అవసరమైన పలు సామగ్రిని అందించారు. తాజాగా విజయ్... నడిఘర్ సంఘానికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్ ను నడిఘర్ సంఘ సభ్యుడు, హీరో విశాల్ కు అందచేశారు.

ఇప్పుడు ఇదే విషయాన్ని విశాల్ సోషల్ మీడియాలో తెలిపారు. "విజయ్.. థ్యాంక్యూ అంటే కేవలం రెండు పదాలు మాత్రమే. కానీ ఒక వ్యక్తి మంచి మనసుతో చేస్తే అది అంతకుమించిన అర్ధం కచ్చితంగా అవుతుంది. నడిఘర్ సంఘ భవన నిర్మాణ పనులకు ఒక కోటి విరాళం ఇచ్చినందుకు నా అభిమాన నటుడు, విజయ్ సోదరుడి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. దేవుడు నిన్ను దీవిస్తారు. మీ మద్దతు లేకుండా బిల్డింగ్ అసంపూర్తిగా ఉంటుందని మాకు తెలుసు" అని విశాల్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం నడిఘర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్‌ గా హీరో కార్తీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే దాదాపు రూ. 40 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నడిఘర్ సంఘ భవనం పనులు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ భవన నిర్మాణానికి సాయం చేయాలని గతంలో విశాల్‌ బహిరంగంగా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

అయితే విశాల్.. నడిఘర్ సంఘం కోసం ఒక భవనాన్ని కట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటానని పలుమార్లు తెలిపారు. మరో వైపు ఈ భవన నిర్మాణ విషయంలో విశాల్.. ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొత్తానికి ఈ బిల్డింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూడాలి మరి. మరోవైపు విజయ్ పాలిటిక్స్ లోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పార్టీ పేరు కూడా ప్రకటించిన విజయ్ త్వరలోనే రెగ్యులర్ పాలిటిక్స్ లో బిజీ అవ్వనున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో కూడా స్నేహసంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే GOAT అనే సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే DVV దానయ్య నిర్మాణంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

@actorvijay Thank u means just two words but means a lot to a person wen he does it from his heart. Well, am talking about my favourite actor our very own #ThalapathiVijay brother for DONATING ONE CRORE towards our #SIAA #NadigarSangam building work. God bless u.

Yes we always… pic.twitter.com/EzJtoJaahu

— Vishal (@VishalKOfficial) March 12, 2024
Tags:    
  • Thalapathivijay 
  • SIAA 
  • Nadigarsangam 
  • Buildingwork 
  • Vishal 
  • Tamilcinema 
  • Filmindustry 
  • Donation 
  • Thalapathydonation 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS