• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మక్కల్ సెల్వన్ బాగా హర్ట్...

మక్కల్ సెల్వన్ బాగా హర్ట్ అయినట్టు ఉన్నాడుగా..?

| ఐతే అలాంటి విజయ్ సేతుపతి ఇక మీదట మల్టీస్టారర్ సినిమాల్లో నటించనని చెప్పి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు

By - Tupaki Desk
Update: 2024-06-08 02:45 GMT

కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న యాక్టర్ విజయ్ సేతుపతి. సినిమాల్లో తను చేసే ఎలాంటి పాత్ర అయినా సరే ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అవుతూ వస్తున్నాడు విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నటించే సినిమా వస్తుంది అంటే ఆయన అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ కూడా చూసేయాలి అన్నంత బజ్ ఉంటుంది. ఎంచుకున్న కథ.. చేసే పాత్ర ఎలాంటిదైనా సరే దానికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాడు విజయ్ సేతుపతి. హీరోగా నటించే సినిమాలే కాదు ప్రతినాయకుడిగా చేసే ప్రాజెక్టుల్లో కూడా తన మార్క్ చూపిస్తూ వచ్చాడు.

ఐతే అలాంటి విజయ్ సేతుపతి ఇక మీదట మల్టీస్టారర్ సినిమాల్లో నటించనని చెప్పి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటి మల్టీస్టారర్ సినిమాల్లో నటించడం వల్ల మంచి మంచి కథలు చెప్పే స్కోప్ ఉంటుంది కదా అనుకోవచ్చు. విజయ్ సేతుపతి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు అంటే అందులో మాక్సిమం ఈయనకి నెగిటివ్ రోల్ ఇస్తున్నారు. అంతేకాదు ఆ పాత్ర కోసం ఎంత కష్టపడినా సరే అనుకున్న పేరు రావట్లేదని భావిస్తున్నారు.

అందుకే ఇక మీదట మల్టీస్టారర్ సినిమాలు, నెగిటివ్ రోల్స్ చేసేది లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు విజయ్ సేతుపతి. స్టార్ హీరోల సినిమాల్లో మరో హీరోగా నటించడం వల్ల ఎంత కష్టపడి చేసినా సరే పేరు అంతా కూడా అవతల వారికి వెళ్తుంది. అందుకే ఇక మీదట అలాంటి సినిమాలు చేయనని చెప్పేశారు విజయ్ సేతుపతి. కోలీవుడ్ లో ఈమధ్య విజయ్ సేతుపతికి విలన్ పాత్రలే ఎక్కువ వచ్చాయి.

వచ్చిన ప్రతి అవకాశాన్ని కాదనకుండా చేసిన విజయ్ సేతుపతి ఇక మీదట అలాంటి పాత్రలు చేయాలని లేదని అన్నాడు. తను లీడ్ రోల్ లో సినిమాలు చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ప్రేమకథలు చేయాలని ఉందని ఆల్రెడీ ఒక సినిమా ఫైనల్ అయ్యిందని త్వరలోనే ఆ సినిమాకు సంబందించిన అనౌన్స్ మెంట్ తో వస్తానని అన్నారు విజయ్ సేతుపతి. మల్టీస్టారర్ సినిమాలు, నెగిటివ్ రోల్ పాత్రలు ఇక మీదట చేయనని చెబుతున్న విజయ్ సేతుపతి కామెంట్స్ చూస్తే అతను ఆ పాత్రల వల్ల బాగానే హర్ట్ అయినట్టు కనిపిస్తున్నాడని అనుకుంటున్నారు ఆడియన్స్. తెలుగులో విజయ్ సేతుపతి రెండు సినిమాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమాలో రాజా పాండి పాత్రలో నటించారు. ఇక బ్లాక్ బస్టర్ మూవీ ఉప్పెనలో శేషారాయణం పాత్ర తో అదరగొట్టిన విషయం తెలిసిందే.

Tags:    
  • Vijaysethupathi 
  • Multistarrermovies 
  • Filmindustry 
  • Sethupathi 
  • Vijaysethupathimovies 
  • Kollywoodactor 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS