• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రీల్ లైఫ్, రియల్ లైఫ్.....

రీల్ లైఫ్, రియల్ లైఫ్.. పవన్ ఫుల్ మాస్: విజయ్

| ఎన్నికల్లో 21కి 21 స్థానాల్లో తన పార్టీని గెలిపించి నేషనల్ వైడ్ గా చర్చనీయాంశంగా మారారు.

By - Tupaki Desk
Update: 2024-06-10 13:10 GMT

సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లో కూడా తాను పవర్ స్టార్ అని పవన్ కళ్యాణ్ నిరూపించుకున్న విషయం తెలిసిందే. పదేళ్లకుపైగా రాజకీయాల్లో ఉన్న జనసేనాని.. ఈసారి ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమిగా ఏర్పడడానికి కీలక పాత్ర పోషించారు. ఎన్నికల్లో 21కి 21 స్థానాల్లో తన పార్టీని గెలిపించి నేషనల్ వైడ్ గా చర్చనీయాంశంగా మారారు.

అయితే పవన్ కళ్యాణ్.. విజయం సాధించిన తర్వాత పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయనకు సంబంధించిన ట్వీట్లే కనిపించాయి. మెగాస్టార్ ఇంట్లో పవర్ విన్నింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. అనేక మంది సినీ ప్రముఖులు.. పవన్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. భారీ విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా విషెస్ చెప్పారు.

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న విజయ్ సేతుపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మహారాజా రిలీజ్ కు సిద్ధమవుతోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ జూన్ 14వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్.. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఓ జర్నలిస్టు అడగ్గా.. పవన్ విక్టరీపై స్పందించారు విజయ్.

"పవన్ కు నా బెస్ట్‌ విషెస్‌ చెబుతున్నాను. ఆయన కష్టాన్ని గౌరవిస్తాను. ఎన్నికల్లో విజయం సాధించడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయని విన్నాను. తొడ కొట్టిన వీడియో చూశాను. అప్పుడే రియల్ లైఫ్‌ లో కూడా ఆయన ఎంత మాసో అర్థమైంది. ఏం జరిగినా స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. ఎవరి కథలోనో ఆయన హీరో కాదు.. ఆయన కథలో ఆయనే హీరో" అని విజయ్ ప్రశంసలు కురిపించారు.

"పవన్‌ సార్ గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ నా వాట్సాప్ స్టేటస్ లో కొందరు తెలుగు వాళ్లు పెట్టిన పవన్ వీడియోస్ చూసి ఏమైందని అడిగాను. అప్పుడు వాళ్లు చాలా విషయాలు చెప్పారు. మీమ్స్‌, ట్రోల్స్‌, టీజింగ్‌ ను ఎవరైతే స్ట్రాంగ్ గా ఎదుర్కొంటారో.. వారు చాలా స్ట్రాంగ్‌ గా అని అర్థం. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా పవన్ మాస్. అన్నీ తట్టుకుని ఆయనంటే ఏంటో చూపించారు" అంటూ గొప్పగా మాట్లాడారు విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.


He is not a hero in somebody's story, He is the hero in his own story.

- #VijaySethupathi about #PawanKalyan at #Maharaja Pre-Release Press Meet#MaharajaFromJune14 #Tupaki pic.twitter.com/sM9js6JlgY

— Tupaki (@tupaki_official) June 10, 2024


Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • FilmIndustry 
  • TamilIndustry 
  • Maharaj 
  • ViajaySethupathi 
  • AnuragKashyap 
  • PreReleasePressMeet 
  • Pawankalyan 
  • Netty 
  • Bharathiraja 
  • Abhirami 
  • MamtaMohandas 
  • Singampuli 
  • Aruldoss 
  • Munishkanth 
  • DineshPurushothaman 
  • NithilanSaminathan 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS