• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  VD 12కి సీక్వెల్… ఆలస్యం...

VD 12కి సీక్వెల్… ఆలస్యం అందుకేనా?

| విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 మూవీ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది

By - Tupaki Desk
Update: 2023-10-06 04:32 GMT

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 మూవీ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్ దేవరకొండ కెరియర్ ఫస్ట్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టొరీతో చేస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందు వలనే ఫస్ట్ ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేయడంపై దేవరకొండ దృష్టి పెట్టాడు.

ఇదిలా ఉంటే VD12 చిత్రం గురించి నిర్మాత నాగ వంశీ తాజాగా ఇంటరెస్టింగ్ విషయాలు బయటపెట్టారు. ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. సుమారు వంద కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని పక్కా ప్లాన్ తో సినిమా చేయనున్నట్లు తెలిపారు. అలాగే సినిమాకి సీక్వెల్ ఆలోచన కూడా ఉందని స్పష్టం చేశారు.

మూవీకి రెండు రకాల క్లైమాక్స్ అనుకున్నామని, సీక్వెల్ కి సరిపోయే విధంగానే ముగింపు ఉంటుందని అన్నారు. అయితే సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా సీక్వెల్ ప్లాన్ చేస్తామని, ఒకవేళ రిజల్ట్ ఆశించిన స్థాయిలో రాకపోతే దానిని పక్కన పెడతామని అన్నారు. సీక్వెల్ కి కావాల్సిన లైన్ కూడా ఇప్పటికే డైరెక్టర్ సిద్ధం చేసారని, కాని ప్రస్తుతం చేస్తోన్న మూవీ రిలీజ్ తర్వాత దానిపై స్పష్టత వస్తుందని అన్నారు.

మొత్తానికి VD12 చిత్రాన్ని విజయ్ దేవరకొండ కెరియర్ ని గ్రాండియర్ గా ఆవిష్కరించే మూవీగానే ప్లాన్ చేస్తున్నట్లు నాగ వంశీ మాటలతో తెలుస్తోంది. మళ్ళీరావా, జెర్సీ సినిమాలతో సక్సెస్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి తనని తాను కమర్షియల్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవడానికి ఈ యాక్షన్ ప్యాక్డ్ కథతో మూవీ చేస్తూ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ తో అనుకున్న కథలో కొద్దిగా మార్పులు చేసి దేవరకొండతో చేస్తున్నట్లు సమాచారం.

Tags:    
  • Vijaydeverakonda 
  • Gauthamtinnanuri 
  • VD12movie 
  • Sitaraentertainments 
  • Sreeleela 
  • Dilraju 
  • Jerseymovie 
  • Devarakonda 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS