• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవరకొండ మొదలు...

దేవరకొండ మొదలు పెట్టాడోచ్..!

| ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ పరిశీలణలో ఉంది. కొద్దిపాటి గ్యాప్ తర్వాత విజయ్ దేవరకొండ పరశురాం మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు

By - Tupaki Desk
Update: 2023-09-12 07:26 GMT

విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా ఈ సినిమా రిలీజై హిట్ అందుకోగా సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇక ఈ సినిమా తర్వాత పరశురాం తో ఒక సినిమా ఫిక్స్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ పరిశీలణలో ఉంది. కొద్దిపాటి గ్యాప్ తర్వాత విజయ్ దేవరకొండ పరశురాం మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ అంతా కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ మృణాల్ ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమాకు హైలెట్ అవుతుందని అంటున్నారు.

ఆల్రెడీ పరశురాం తో గీత గోవిందం హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని సిద్ధం చేస్తున్నాడు. దిల్ రాజు ని మెప్పించాడు అంటే సినిమాలో మ్యాటర్ ఉంటుందని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండతో ఆల్రెడీ ఒక హిట్ అనుభవం ఉంది కాబట్టి అతనికి మరో హిట్ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు పరశురాం. మహేష్ తో సర్కారు వారి పాట సినిమా చేసిన పరశురాం ఆ తర్వాత స్టార్ హీరోలతో చేయాలని అనుకున్నా కుదరలేదు. అందుకే విజయ్ తో కథ సెట్ చేసుకుని సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

ఈ సినిమా పూర్తి చేశాకనే గౌతం తో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు విజయ్. విడి 13వ సినిమాగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా ఈ కాంబో సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందించేలా చూస్తున్నారు. గీతా గోవిందం తరహాలోనే ఈ సినిమాను కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడట పరశురాం. ఆల్రెడీ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ ప్లాన్ చేయగా పొంగల్ రేసులో విజయ్ దేవరకొండ సినిమా కూడా రిలీజ్ చేసి పోటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఆల్రెడీ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం మొదలు పెట్టిన షెడ్యూల్ తో సినిమా సగానికి పైగా పూర్తవుతుందని తెలుస్తుంది.

Tags:    
  • Mrunalthakur 
  • VD13movie 
  • Vijaydeverakonda 
  • Parasuram 
  • Dilraju 
  • Familystarmovie 
  • Devarakonda 
  • Kushimovie 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS