కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్.. విజయశాంతి పవర్ఫుల్ ఎలివేషన్స్!

అర్జున్‌ సన్‌ ఆఫ్‌ వైజయంతి సినిమాపై క్రేజ్ ఊపందుకుంటున్న వేళ, సీనియర్ నటి విజయశాంతి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.;

Update: 2025-04-13 04:01 GMT

అర్జున్‌ సన్‌ ఆఫ్‌ వైజయంతి సినిమాపై క్రేజ్ ఊపందుకుంటున్న వేళ, సీనియర్ నటి విజయశాంతి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చాలా కాలం తర్వాత మళ్లీ ఒక పూర్తి పాత్రతో వెండితెరపై కనిపించబోతున్న విజయశాంతి, ఈ చిత్రంలో తల్లి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆమె చెప్పిన మాటలు భావోద్వేగాన్ని కలిగించాయి.

చాలామంది ఫ్యాన్స్ మళ్ళీ మంచి పాత్రలు చేయాలని కోరారు, సరిలేరు నికెవ్వరు లాంటి సినిమా చేసినా సరిపోలేదు అన్నారు.. ఇక ఇప్పుడు ఒక మంచి క్యారేక్టర్ దొరికింది. ఈ చిత్రం తల్లిదండ్రుల విలువను, తల్లితో కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని కొత్త కోణంలో చూపిస్తుందని విజయశాంతి అభిప్రాయపడారు. ‘‘తల్లి తన పిల్లల భవిష్యత్తు కోసం ఎంత త్యాగం చేస్తుందో, ఎలాంటి సంఘర్షణలతో ఎదుర్కొంటుందో చూపించే సినిమా ఇది. ఇది కమర్షియల్ ఫార్మాట్‌లో సాగుతూ, ప్రేక్షకుడి గుండెను తాకే విధంగా ఉంటుంది’’ అంటూ చెప్పుకొచ్చారు.

దర్శకుడు ప్రదీప్ చిలుకూరి చెప్పిన కథ తనకు తట్టిపడిందని, తన పాత్రకు సంబంధించి కొన్ని సూచనలు చేసిన తర్వాత పూర్తి కథ నచ్చిందని విజయశాంతి తెలిపారు. షూటింగ్ సమయంలో సినిమాపై తనకు చాలా నమ్మకం కలిగిందనీ, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ముందే తెలుసుకున్నానని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. కథలో తల్లి, కొడుకు మధ్య వచ్చే గొడవలు, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకి హైలైట్ అవుతాయని వెల్లడించారు.

ఇక ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లపై విజయశాంతి చేసిన కామెంట్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే విజయశాంతి మాట్లాడుతున్న సమయంలో ఫ్యాన్స్ గోల ఎక్కువ కావడంతో ఎన్టీఆర్ కాస్త అసహనం వ్యక్తం చేశారు. వెళ్లిపోవలా అంటూ.. కాస్త సైలెంట్ గా ఉండాలని సైగ చేశారు. అయినప్పటికీ సౌండ్ తగ్గలేదు. ఇక అర్థం చేసుకున్న విజయశాంతి తారక్ ను పట్టుకొని ఫ్యాన్స్ గోల సరదాగా స్పందించారు.

ఇక హీరోలిద్దరి గురించి మాట్లాడుతూ.. ‘‘జూనియర్ ఎన్టీఆర్‌ ఎంత డెడికేషన్‌తో నటించారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన నటనలో సీనియర్ ఎన్టీఆర్ గొప్పతనం కనబడుతుంది. కల్యాణ్‌రామ్‌ కూడా ఎంతో మారిపోయారు. ఆయన నటన, మానసిక స్థితి చూస్తే నిజంగా రామునిలా కనిపిస్తారు. ఇద్దరూ కలిసి రామలక్ష్మణుల్లా ఉన్నారు’’ అంటూ విజయశాంతి పవర్ఫుల్ ఎలివేషన్స్ ఇచ్చారు.

ఈ సినిమాతో తనకు మంచి పాత్ర దొరికిందన్న సంతృప్తి విజయశాంతికి కనిపిస్తోంది. ఇప్పటివరకు నా కెరీర్‌లో చేసిన పాత్రలలో ఇది ప్రత్యేకం. నిజంగా ప్రతి తల్లికి అంకితమివ్వాల్సిన కథ. స్త్రీ హృదయాన్ని ముడిపెట్టి చెప్పిన కథ ఇది. ఎమోషన్, యాక్షన్ అన్నీ పకడ్బందీగా ఉన్న ఈ సినిమా, కచ్చితంగా అందరినీ అలరిస్తుంది.. అంటూ చెప్పుకొచ్చారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘అర్జున్‌ సన్‌ ఆఫ్‌ వైజయంతి’ చిత్రం, ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై విజయశాంతి నమ్మకంతో చెప్పిన మాటలు ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలను పెంచుతున్నాయి.

Tags:    

Similar News