• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సీనియ‌ర్ ఎన్టీఆర్‌తో...

సీనియ‌ర్ ఎన్టీఆర్‌తో క‌ళ్యాణ్ రామ్ పోలిక‌!

| సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ లాంటి స్టార్ల‌తో న‌టించిన విజ‌య‌శాంతి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించారు

By - Tupaki Desk
Update: 2023-10-25 05:19 GMT

సీనియ‌ర్ ఎన్టీఆర్ తో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ పోలిక ఇప్పుడు ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్ గా మారింది. అయితే క‌ళ్యాణ్ రామ్ ని ఎన్టీఆర్ తో పోల్చిన‌ది ఎవ‌రో తెలుసా? లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి అత‌డిని ఒక రేంజులో పొగిడేశారు. నటుడు నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ ఎదుటివారికి ఇచ్చే గౌర‌వానికి విజ‌య‌శాంతి ఎంతో మురిసిపోయారు. ప్రస్తుతం అత‌డు తాను న‌టించిన 'డెవిల్' విడుద‌ల‌ కోసం ఎదురుచూస్తున్నాడు. దీంతో పాటు అత‌డు ప‌లు ఆసక్తికరమైన ప్రాజెక్టులు చేస్తున్నాడు. NKR 21 ఇటీవ‌లే ప్రారంభమైంది. కళ్యాణ్ రామ్ కి ఇది 21వ సినిమా. ఆశ్చర్యకరంగా సీనియర్ నటి విజయశాంతి ఈ ప్రాజెక్ట్‌లో చేరారు. సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించ‌నున్నారు. 'స‌రిలేరు నీకెవ్వరు' తర్వాత విజ‌య‌శాంతి వేరొక సినిమాకు సంత‌కం చేయ‌లేదు. క‌ళ్యాణ్ రామ్ బృందం వినిపించి కథ ఆమె పాత్ర న‌చ్చాయి గ‌నుకే ఇప్పుడు తిరిగి న‌టిస్తున్నారు.

తాజాగా విజ‌య‌శాంతి షేర్ చేసిన ఓ ఫోటో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. దాదాపు 30 సంవత్సరాల క్రితం సినిమా లాంచ్ సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్‌తో విజయశాంతి ఓ వేదిక‌పై క‌నిపిస్తుండ‌గా, ఆ ఫోటోతో జోడించిన NKR21 ఈవెంట్ ఫోటో (కళ్యాణ్ రామ్‌తో కలిసి ఉన్న ఫోటో) చూడ‌గానే ఎంతో ఆక‌ర్షించాయి. లెజెండ్‌ ఎన్టీఆర్‌ నుంచి తనకు లభించిన గౌరవం అంత గొప్ప‌ది అని విజ‌య‌శాంతి పేర్కొన్నారు. ఆర్టిస్ట్‌గా తనకు ఎప్పుడూ స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని ఇచ్చే క్షణాలు ఇవేన‌ని పేర్కొన్నారు. ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హరికృష్ణ భండారి స్క్రీన్ ప్లే రాశారు. NKR 21 అశోక్ వర్ధన్ ముప్పా -సునీల్ బలుసు నిర్మించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, అశోక క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ లాంటి స్టార్ల‌తో న‌టించిన విజ‌య‌శాంతి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించారు. లేడీ బాస్ గా విజ‌య‌శాంతి నాయికా ప్ర‌ధాన పాత్ర‌ల‌తోను మెప్పించారు. ఒకేయ్ రాముల‌మ్మ లాంటి జాతీయ అవార్డ్ చిత్రంలోను విజ‌య‌శాంతి న‌ట‌న‌కు పేరొచ్చింది. ఇప్పుడు క్యారెక్ట‌ర్ న‌టిగా త‌న స్థాయికి త‌గ్గ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Tags:    
  • NKR21poojaceremony 
  • Nandamurikalyanram 
  • Seniorntr 
  • Nandamurifamily 
  • Filmindustry 
  • Kalyanram 
  • Vijayashanthi 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS