దళపతి విజయ్ రూల్ పై దిల్ రాజు ప్రశంసలు.. అదేంటో తెలుసా?
కోలీవుడ్ నటుడు దళపతి విజయ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని సత్తా చాటారు.;

కోలీవుడ్ నటుడు దళపతి విజయ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని సత్తా చాటారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా మారారు. అదే సమయంలో జన నాయగన్ మూవీలో కూడా నటిస్తున్నారు. అదే ఆయన చివర మూవీ అని సినీ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
అయితే విజయ్ వర్కింగ్ స్టైల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు కారణం ప్రముఖ నిర్మాత దిల్ రాజు కామెంట్స్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో విజయ్ పనితీరుపై ఆయన మాట్లాడారు. ప్రశంసల వర్షం కురిపించారు. వర్కింగ్ డేస్ విషయంలో విజయ్ క్లారిటీగా ఉంటారని చెప్పారు. ఆయన పనితీరు భిన్నంగా ఉంటుందని తెలిపారు.
షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో.. ఎప్పుడు ఎండ్ చేస్తారోన్న విషయంపై విజయ్ క్లారిటీగా ఉంటారని దిల్ రాజు చెప్పారు. షూటింగ్ కోసం ఎన్ని రోజులు కేటాయిస్తానో ముందే చెబుతారని తెలిపారు. ఉదాహరణకు సినిమాకు 120 రోజులు షూటింగ్ లో పాల్గొనాల్సి వస్తే.. ప్రతి మంత్ 20 రోజులు సెట్స్ కు వస్తానని చెప్తారని అన్నారు.
దీంతో షూటింగ్ అనుకున్న టైమ్ కే మూవీ కంప్లీట్ అవుతుందని వ్యాఖ్యానించారు. ఆరు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేయవచ్చని అన్నారు. అయితే విజయ్ ఆలోచనను ఇతర హీరోలు కూడా ఫాలో అయితే బాగుంటుందని తెలిపారు. అప్పుడు నిర్మాతలకు కచ్చితంగా అది గోల్డెన్ ఛాన్స్ అవుతుందని పేర్కొన్నారు.
ప్రతి నెలా 15 లేదా 20 రోజులు కేటాయిస్తానని ముందే చెబితే టీమ్ కు బాధ్యత పెరుగుతుందని, ఒక పాజిటివ్ ప్రెజర్ కూడా ఉంటుందని తెలిపారు. అలా చేస్తే షూటింగ్ అనుకున్న టైమ్ కన్నా ముందే కంప్లీట్ అవుతుందని చెప్పారు. కానీ టాలీవుడ్ లో ప్రస్తుతం ఆ పద్ధతి లేదని, అలా ఉండాలని ట్రై చేస్తున్నట్లు దిల్ రాజు చెప్పారు.
ప్రస్తుతం దిల్ రాజు కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు, సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు. దిల్ రాజు వ్యాఖ్యల్లో నిజముందని అంటున్నారు. మన హీరోలు విజయ్ రూల్ ఫాలో అవ్వడానికి ట్రై చేయాలని సజ్జెస్ట్ చేస్తున్నారు. అప్పుడు ఇండస్ట్రీలో సానుకూల వాతావరణం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.