నంబర్ ప్లేట్ గిఫ్ట్ వెనుక అసలు వ్యూహం!
ప్రస్తుతం ఇండియా అంతటా మారు మ్రోగుతోన్న పేరు ఒకే ఒక్కటి. అదే దళపతి విజయ్.
ప్రస్తుతం ఇండియా అంతటా మారు మ్రోగుతోన్న పేరు ఒకే ఒక్కటి. అదే దళపతి విజయ్. రాజకీయంలో కొమ్ములు తిరిగిన మొనగాళ్లందర్నీ ఓడించి తొలి ఎన్నికలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పటికే విజయ్ ని కలవాల్సిన వాళ్లంతా స్వయంగా కలిసి విషెస్ తెలియజేసారు. తాజాగా వారందరికీ భిన్నంగా దర్శకుడు వెంకట్ ప్రభు ఓ కారు నెంబర్ ప్లేట్ ను గిప్టుగా అందించడం సంచలనగా మారింది. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో `గ్రేటెస్ట్ ఆఫ్ ఆలై టైమ్` అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఆ సినిమాలో విజయ్ వాడిన కారుపై TN07 CM 2026 అని ఉంటుంది. సరిగ్గా అదే నెంబర్ ప్లేట్ ను ఇప్పుడు విజయ్ కవి డిజైన్ చేయించి స్వయంగా అందించారు. అయితే ఈ కలయిక వెనుక సాధారణ మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదు. దీని వెనుక బలమైన సెంటిమెంట్ - వ్యూహాత్మక రాజకీయ అంశం ముడిపడి ఉందనే చర్చ మొదలైంది. ఆ నంబర్ ప్లేట్ పై స్పష్టంగా TN07 CM 2026 అని ముద్రించి ఉంది. సినిమా షూటింగ్ సమయంలో ఒక సాధారణ ప్రాప్‌గా ఉపయోగించిన ఈ నంబర్ ప్లేట్‌ను దర్శకుడు వెంకట్ ప్రభు ఇంత కాలం భద్రపరిచి విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గిఫ్ట్‌గా ఇవ్వడం వెనుక మొదటి వ్యూహం సెంటిమెంట్ బూస్ట్ అవ్వొచ్చు.
వెండి తెరపై దర్శకుడిగా తాను సృష్టించిన ఆ ఊహాజనిత గెలుపును నిజ జీవితంలో విజయ్ సాధించిన పొలిటికల్ సక్సెస్‌కు ఒక శుభసూచకం కనిపిస్తోంది. ఆ నంబర్ ప్లేట్‌లో కేవలం CM 2026 అని కాకుండా నిర్దిష్టంగా TN07 అని ఉండటం. TN07 అనే రిజిస్ట్రేషన్ కోడ్ తమిళనాడు రాజధాని చెన్నైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన, రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన మైలాపూర్ ప్రాంతానికి చెందింది. తమిళనాడు రాజకీయాలలో చెన్నై కోటను దక్కించుకోవడమే ప్రధాన లక్ష్యం కాబట్టి రాజధాని కేంద్రంగానే విజయ్ తన అసలైన పొలిటికల్ చక్రం తిప్పబోతున్నారనే ఒక బలమైన రాజకీయ ముద్రను సామాన్య ఓటర్లలో క్రియేట్ చేయడానికి ఈ కోడ్ ఉపయోగపడుతుందనేది విశ్లేషకుల అంచనా.
ఆ కోణంలో చూస్తే తన సినిమా ద్వారా ఓటర్లను ముందుగానే ప్రభావితం చేసాడా? అన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. సినిమా రంగానికి- తమిళనాడు రాజకీయాలకు విడదీయరాని బంధం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. కోలీవుడ్ వర్గాల నుండి విజయ్ రాజకీయ ప్రయాణానికి ఇలాంటి ఓపెన్ సపోర్ట్ లభించడం తో సినిమా పరిశ్రమలోని ఓ పెద్ద వర్గం విజయ్ వైపే ఉందనే సంకేతాన్ని కూడా ఇండస్ట్రీకి పంపినట్లయింది. ఒక దర్శకుడిగా తన హీరో భవిష్యత్తుపై వెంకట్ ప్రభుకున్న నమ్మకం , కృతజ్ఞతా భావాన్ని చాటు కుంటూనే పొలిటికల్ సర్కిల్స్ లో బలమైన చర్చకు తెరలేపడంలో ఈ గిఫ్ట్ ఐడియా సక్సెస్ అయింది. సినిమాల్లోని ఎలిమెంట్స్ థియే టర్ల వరకే పరిమితం కాకుండా? ఒక లీడర్ పొలిటికల్ ఇమేజ్ ను బిల్డ్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడతాయో? చెప్పడానికి తాజా ఇన్సిడెంట్ ఓ ఉదాహరణ.