మళ్లీ వాయిదా పడ్డ విజయ్ -సంగీతల విడాకుల కేస్.. రంగంలోకి ఆమె!
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జంటగా పేరు దక్కించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు విజయ్ - సంగీత.. రెండు దశాబ్దాలకు పైగా సవ్యంగా సాగిన వీరి కాపురం బీటలు వారింది.
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జంటగా పేరు దక్కించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు విజయ్ - సంగీత.. రెండు దశాబ్దాలకు పైగా సవ్యంగా సాగిన వీరి కాపురం బీటలు వారింది. 2026 సంవత్సరం వీరి బంధానికి కలిసి రాలేదు. పైగా వీరికి జాసన్ సంజయ్ , దివ్యసాష అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో వీరు విడాకులు కోరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా వీరు తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటూ ఎంతోమంది ఆరా తీశారు. పైగా ఒక సినీ నటితో విజయ్ రిలేషన్ లో ఉన్నారని ఆమె ఆరోపించింది. కానీ ఎక్కడ ఆమె పేరును బయట పెట్టలేదు.
అయితే వీళ్ళిద్దరూ (త్రిష- విజయ్)కలిసి బహిరంగంగా కనిపించడంతో అందరూ త్రిష పేరును ప్రస్తావిస్తున్నారు. అటు విజయ్ రాజకీయంగా అడుగులు వేస్తున్న సమయంలో ఆయన వెన్నంటే నిలిచింది త్రిష. ఎన్నికల సమయంలో హడావిడి చేసింది. అంతేకాదు ఎన్నికల ఫలితాల సమయంలో కూడా నేరుగా తిరుపతి నుండి విజయ్ ఇంటికి వెళ్లి ఆయనను అభినందించింది. అంతేకాదు విజయ్ ప్రమాణ స్వీకారం సమయంలో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచి అందరి దృష్టిని ఆకట్టుకుంది.
ఇక అలా వీళ్ళిద్దరి వల్లే ఆమె విడాకులు తీసుకోబోతోంది అని చాలామంది పలు రకాల కామెంట్లు కూడా చేశారు. అటు కోర్టులో విచారణ కూడా జరుగుతోంది. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా ఒకసారి విచారణ జరగగా.. ఇప్పుడు మరోసారి ఈ విడాకుల కేసు ఈరోజు విచారణకు వచ్చింది. ఈ విడాకుల కేసు పిటిషన్ పై విచారణ జరిపిన చెంగల్పట్టు మహిళా కోర్టు ఈ విడాకుల కేసు విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసింది. ఇకపోతే ఈ కేసును మళ్లీ వాయిదా వేయడంతో అందరిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో ఆయన కోర్టు చుట్టూ తిరగడం సవ్యంగా లేదని పలువురు రాజకీయ ప్రముఖులు కూడా కామెంట్ చేస్తున్నారు.
పైగా ఇలాంటి సమయంలో ఈ విడాకుల కేసు వాయిదా పడడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇకపోతే మరొకవైపు విజయ్ తల్లి చొరవతో మళ్లీ వీరిద్దరూ ఒక్కటవుతారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా అటు రాజకీయంగా ముఖ్యమంత్రిగా తమిళనాడుకు బాధ్యతలు చేపట్టిన విజయ్.. మరొకవైపు తన ఫ్యామిలీతో కూడా సంతోషంగా ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరి తదుపరి విచారణలో విజయ్ - సంగీత కలిసిపోతారా ?లేక విడాకులు తీసుకుంటారా? అనే సస్పెన్షన్ ఇప్పుడు ఏర్పడింది.
ఇక విజయ్ విషయానికి వస్తే.. విజయ్ నటించిన చివరి సినిమా జననాయగన్. ఈ సినిమా విడుదలకు ఇంకా నోచుకోలేదు. అదిగో ఇదిగో అంటున్నారే కానీ ఇంకా సరైన క్లారిటీ లేకపోవడం గమనార్హం. ఇక ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చిన తొలి ప్రయత్నంలోనే విజయ్ ముఖ్యమంత్రిగా అవతరించారు. మునుముందు ఆయన రాజకీయంగా మరిన్ని శిఖరాలు చూడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.