సోలోగా పరాశక్తి.. రిస్క్ ఎక్కువే..?

ప్రస్తుతం కోలీవుడ్ లో దళపతి విజయ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. ఆయన సినిమాలు చేస్తున్న టైం లోనే రిలీజ్ టైంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చేది.;

Update: 2026-01-08 04:24 GMT

ప్రస్తుతం కోలీవుడ్ లో దళపతి విజయ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. ఆయన సినిమాలు చేస్తున్న టైం లోనే రిలీజ్ టైంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆయన పొలిటికల్ పార్టీ పెట్టాడు కాబట్టి ఆ ఇంపాక్ట్ మరింత ఉంది. దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్ అసలైతే జనవరి 9 అంటే రేపు శుక్రవారం రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో పాటు మిగతా ఇష్యూస్ అన్నీ జరిగి సినిమా రిలీజ్ వాయిదా పడేలా చేశాయి.

దళపతి విజయ్ చివరి సినిమా..

సంక్రాంతికి తమిళంలో విజయ్ జన నాయగన్ తో పాటు శివ కార్తికేయన్ పరాశక్తి రిలీజ్ లాక్ చేసుకున్నాయి. జనవరి 9న జన నాయగన్ వస్తుంటే.. 10న పరాశక్తి రిలీజ్ అవుతుంది. ఐతే ఇప్పటికే దళపతి విజయ్ చివరి సినిమాకు పరాశక్తి పోటీ వస్తుందని శివ కార్తికేయన్ మీద దళపతి ఫ్యాన్స్ ఎటాకింగ్ మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ ఒక రేంజ్ లో జరుగుతుంది.

రెండు సినిమాలు రిలీజైతే ఎవరి సినిమా బలం వారిది కాబట్టి ఏది బాగుంటే ఆడియన్స్ దాన్ని హిట్ చేస్తారు. కానీ సంక్రాంతికి పోటీగా అనుకున్న ఒక సినిమా వాయిదా పడటంతో ఆ హీరో ఫ్యాన్స్ ఇంకాస్త ఆగ్రహంగా ఉన్నారు. సోలోగా పరాశక్తి రిలీజ్ అవుతుంది. సినిమాకు హిట్ టాక్ వస్తే ఓకే ఒకవేళ సినిమా ఏమాత్రం నిరాశపరచినా కూడా దళపతి ఫ్యాన్స్ ఆ సినిమా మీద ఎటాక్ చేసే ఛాన్స్ లేకపోలేదు.

దళపతి ఫ్యాన్స్ హర్ట్..

శివ కార్తికేయన్ కు స్వతహాగా దళపతి విజయ్ అంటే ఇష్టమే.. కానీ సినిమాల దగ్గరకు వచ్చే సరికి పోటీ పడక తప్పలేదు. కానీ పరాశక్తి రిలీజ్ అవుతూ జన నాయగన్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడటం దళపతి ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేసింది. అందుకే సోలోగా రిలీజ్ అవుతున్న పరాశక్తి మీద ఈ ఇంపాక్ట్ పడుతుంది. మరోపక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ కూడా తమిళ్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా జన నాయగన్ రిలీజ్ రోజే వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది.

జన నాయగన్ రిలీజ్ వాయిదా పడటం దళపతి ఫ్యాన్స్ ని తీవ్రంగా హర్ట్ చేసింది. ఐతే సినిమా రిలీజ్ ఆగిపోవడం వెనుక ఉన్న రాజకీయ శక్తుల గురించి విజయ్ ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ చివరి సినిమా సంక్రాంతికి వస్తుందని అనుకున్న ఫ్యాన్స్ కి డిజప్పాయింట్ తప్పేలా లేదు. ఐతే ఇష్యూని సాల్వ్ చేసి జనవరి 9 మిస్సైనా సంక్రాంతికి ఎలాగైనా సినిమా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News