మ‌హేష్ లా జ‌న‌నాయ‌గ‌న్ హైలైట్ అవుతాడా?

ప్ర‌స్తుతం ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌థానాయ‌కుడిగా కోలీవుడ్ లో `జ‌న‌నాగ‌న్` టైటిల్ తో హెచ్. వినోధ్ ఓ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-05-04 22:30 GMT

`భ‌ర‌త్ అనే నేను` లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ ముఖ్య‌మంత్రి పాత్ర పోషిస్తున్నాడంటే కోర‌టాల శివ ఆ పాత్ర‌ను తెర‌పై ఎలా ఆవిష్క‌రిస్తాడు? అనే సందేశాలు చాలా మందిలో వ్య‌క్త‌మ‌య్యాయి. క‌మ‌ర్శియ‌ల్ స్టోరీలో మ‌హేష్ సీఎం రోల్ ఏంటి అనే విమ‌ర్శ వ్య‌క్త‌మైంది. `లీడ‌ర్ 2` లా ప‌క్కా పొలిటిక‌ల్ సినిమా ట్రై చేస్తున్నాడా? అన్నారు. దీంతో ఈ పాత్ర ఎలా ఉంటుందోన‌ని ఆందోళ‌న క‌నిపించింది. ఆ పాత్ర‌ను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తార‌ని క్రిటిక్స్ లో ఒక‌టే క్యూరియాసిటీకి దారి తీసింది.

క‌ట్ చేస్తే భ‌ర‌త్ పాత్ర‌ను కొర‌టాల డీల్ చేసిన విధానానికి అంతా ఔరా అన్నారు. క‌మ‌ర్శియ‌ల్ సినిమాలో క్లాసిక్ సీఎంని ఆవిష్క‌రించి షెభాష్ అనిపిం చుకున్నాడు. భావి భార‌తానికి ఇలాంటి క‌ఠిన‌మైన ముఖ్య మంత్రి రాష్ట్రానికి ఒక‌రుంటే? దేశం తీరే మారుతుంద‌నిపించింది. సీఎం ప‌ద‌విలోనే భ‌ర‌త్ అద్భుత‌మైన హీరోయిజాన్ని చూపించాడు. హీరోలు సీఎం పాత్ర‌లు పోషించి ఇలా కూడా మెప్పించొచ్చ‌ని ప్రూవ్ చేసారు. ఇప్పుడీ చ‌ర్చంతా దేనికంటారా? అయితే అస‌లు విష‌యంలోకి వెళ్లాల్సిందే.

ప్ర‌స్తుతం ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌థానాయ‌కుడిగా కోలీవుడ్ లో `జ‌న‌నాగ‌న్` టైటిల్ తో హెచ్. వినోధ్ ఓ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైన నేప‌థ్యంలో విజ‌య్ చేస్తోన్న తొలి రాజ‌కీయ చిత్ర‌మిది. `జ‌న‌నాయ‌గ‌న్` టైటిల్ తోనే ఓ వైబ్ క్రియేట్ అయింది. సినిమాలో విజ‌య్ పాత్ర ఎలా ఉంటుంద‌ని స‌ర్వ‌త్రా ఆస‌క్తి మొద‌లైంది. విజ‌య్ పొలిటిక‌ల్ కెరీర్ ని దృష్టిలో పెట్టు కుని రాసిన క‌థలో ద‌ళ‌ప‌తి ప‌వ‌ర్ వెండి తెర‌పై ఎలా ఆవిష్కృత‌మ‌వుతుందన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వినోద్ ఇంత వ‌ర‌కూ పొలిటిక‌ల్ సినిమాలు చేసింది లేదు. చేసిన సినిమాల‌న్నీ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రాలే. ఈ నేప‌థ్యంలో `జ‌న‌నాయ‌గ‌న్` ని ఎలా డీల్ చేస్తాడు? విజ‌య్ రోల్ క‌మ‌ర్శియ‌ల్ యాస్పెక్ట్ లో ఎలా ఉండ‌బోతుంది? అన్న దానిపై కోలీవుడ్ మీడియాలో ర‌క‌ర‌కాల డిబేట్లు న‌డుస్తున్నాయి. దీంతో విజయ్ రోల్ భ‌ర‌త్ లో మ‌హేష్ లా ఉండ‌బోతుందా? అన్న అంచ‌నాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

Tags:    

Similar News