సీఎం సార్ సినిమాకు ముహూర్తం ఖరారు..!
స్టార్ హీరోల సినిమాలు ఈ మధ్య కాలంలో అనుకున్న సమయానికి రాక పోవడం కామన్ అయింది. అందుకు షూటింగ్ ఆలస్యం కావడం, వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఆలస్యం కావడం మనం చూస్తూ ఉంటాం.
స్టార్ హీరోల సినిమాలు ఈ మధ్య కాలంలో అనుకున్న సమయానికి రాక పోవడం కామన్ అయింది. అందుకు షూటింగ్ ఆలస్యం కావడం, వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఆలస్యం కావడం మనం చూస్తూ ఉంటాం. కానీ షూటింగ్ పూర్తి చేసుకుని, వీఎఫ్‌ఎక్స్ వర్క్ సైతం పూర్తి చేసుకుని విడుదల కాకుండా ఆగిన సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. సూపర్ స్టార్ రేంజ్ హీరోల సినిమాలు అలా ఆగడం దాదాపు కనిపించదు. కానీ తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన జన నాయగన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రేక్షకుల ముందుకు రాలేక పోయింది. దాదాపు ఆరు నెలలుగా దర్శక నిర్మాతలు జన నాయగన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రాజకీయ అరంగేట్రం నేపథ్యంలో ఆయన చివరి మూవీగా జన నాయగన్ ను ప్రచారం చేస్తూ వచ్చారు. అదే రాజకీయం కారణంగా సినిమా విడుదల కాకుండా ఆగి పోయిందనే ఆరోపణలు ఉన్నాయి.
జన నాయగన్ సినిమా రిలీజ్...
విజయ్ ప్రత్యర్థులు జన నాయగన్ సినిమా విడుదలను అడ్డుకుంటున్నారని అభిమానులు అంటున్నారు. ఇప్పుడు విజయ్ తమిళనాడు సీఎం అయ్యాడు. కనుక జన నాయగన్ సినిమా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్ని సెంటర్స్ అంటే అన్ని సెంటర్స్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సీఎంగా ఇన్ని రోజులు బిజీ బిజీగా ఉన్న విజయ్ ఇప్పుడు జన నాయగన్ సినిమా విడుదల విషయమై నిర్మాతలతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే జన నాయగన్ సినిమా నిర్మాతకు విజయ్ కీలకమైన నామినేటెడ్ పదవి ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. జన నాయగన్ సినిమా విడుదల విషయంలోనూ విజయ్ నుంచి సహకారం అందినట్లుగా నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధులు అంటున్నారు. తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాకు సెన్సార్ కంప్లీట్ చేసి ఇదే నెలలో విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నాడు.
బాలకృష్ణ భగవంత్ కేసరి రీమేక్...
తెలుగు మూవీ భగవంత్ కేసరికి కాస్త మార్పులు చేర్పులు చేసి జన నాయగన్ సినిమాను రూపొందించారు. బాలకృష్ణ పోషించిన పాత్రను విజయ్ పోషించగా, కాజల్ పోషించిన పాత్రను పూజా హెగ్డే పోషించినట్లు తెలుస్తోంది. సినిమాలో శ్రీలీల పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది. ఆ పాత్రను తమిళ్‌లో మమితా బైజు పోషించింది. తెలుగు సినిమాకు రీమేక్ అయినప్పటికీ చాలా మార్పులు చేయడంతో పాటు, నేటివిటీ సైతం మార్చడం వల్ల తెలుగు ప్రేక్షకులు న్యూ మూవీగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జులై 23 లేదా 24న ప్రేక్షకుల ముందుకు జన నాయగన్ రావడం ఖాయం అంటూ తమిళ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు జరిగాయని, సెన్సార్ బోర్డ్ నుంచి ఎ సర్టిఫికెట్ సైతం వచ్చిందనే వార్తలు తమిళ మీడియాలో గుప్పుమంటున్నాయి.
తమిళనాడు సీఎం విజయ్ చివరి సినిమా...
విజయ్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో జన నాయగన్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు విజయ్ ఏకంగా సీఎం అయ్యాడు. పైగా ఆయన చివరి మూవీ కావడంతో తమిళనాట ఓపెనింగ్స్ నెవ్వర్ బిఫోర్ అన్నట్లుగా నమోదు కావడం ఖాయం అని బాక్సాఫీస్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడం ద్వారా మంచి ఓపెనింగ్స్‌ను ఆశిస్తున్నారు. విజయ్‌కి ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ నెంబర్స్ నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ నెలలో పెద్ద సినిమాలు, తెలుగు స్టార్ హీరోల సినిమాలు లేకపోవడం కలిసి వచ్చే అంశం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు. కేవలం తమిళ్, తెలుగు మాత్రమే కాకుండా సౌత్‌లోని అన్ని భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. సీఎం సార్ సినిమా జన నాయగన్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాదని, ఆయన అభిమానులు రెడీగా ఉండాలని నిర్మాణ సంస్థకు చెందిన వారు ఆఫ్ ది రికార్డ్ అంటున్నారు.