రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్'.. విజయ్ తో లాభమేనా?
స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న రీసెంట్ గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;
స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న రీసెంట్ గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కంప్లీట్ లవ్ స్టోరీగా నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాతో రష్మిక అందరినీ అలరించారు. తన యాక్టింగ్ తో అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పించారు.
ఓవరాల్ గా సినిమా కూడా సాలిడ్ వసూళ్లను రాబడుతోంది. వీకెండ్ తోపాటు వీక్ డేస్ లో కూడా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ దూసుకుపోతోంది. థియేటర్స్ కు ఆడియన్స్ ను రప్పిస్తోంది. సినిమా తమకు నచ్చిందని అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు పోస్టులు పెడుతున్నారు. దీంతో మేకర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
అదే సమయంలో ఇప్పుడు నవంబర్ 12వ తేదీన అంటే రేపే సక్సెస్ మీట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో ఈవెంట్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా స్టార్ హీరో విజయ్ దేవరకొండను చీఫ్ గెస్ట్ గా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈవెంట్ మరింత గ్రాండ్ గా ఉండబోతుందనే చెప్పాలి.
ఎందుకంటే రష్మిక, విజయ్ లు ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ఎంగేజ్మెంట్ రూమర్స్ తర్వాత రష్మిక, విజయ్ ఒకే వేదిక మీద కనిపించనుండటంతో అటు ప్రేక్షకులు ఇటు ఫ్యాన్స్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే సక్సెస్ మీట్ కు విజయ్ దేవరకొండ రానుండడం.. సినిమాకు లాభం చేకూరుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మూవీపై పాజిటివ్ బజ్ నడుస్తోంది. దానికి తోడు.. విజయ్ ఈవెంట్ లో సినిమా కోసం మాట్లాడితే కచ్చితంగా అనేక మంది దృష్టి పడుతుంది. దీంతో వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది.
నిజానికి గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ చీఫ్ గెస్ట్ గా వస్తారని అంతా ఎక్స్పెక్ట్ చేశారు.. దాదాపు ఫిక్స్ కూడా అయ్యారు. కానీ ఏమైందో తెలియదు. విజయ్ అప్పుడు సందడి చేయలేదు. ఇప్పుడు సక్సెస్ మీట్ కు కచ్చితంగా రానున్నారని సమాచారం. ఇప్పటికే మేకర్స్ అందుకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారట. మరి సక్సెస్ మీట్ లో విజయ్ ఏం మాట్లాడతారో.. సినిమా వసూళ్లు పెరగడంలో ఎంతలా దోహదపడతారో వేచి చూడాలి.