రౌడీతో శ్రీవల్లి మేడం ముందస్తు బర్త్‌డే...!

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం ఫుల్‌ జోష్‌ మీద ఉన్న విషయం తెల్సిందే. 2023లో యానిమల్‌, 2024లో పుష్ప 2, 2025లో ఛావా సినిమాలతో బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ విజయాలను సొంతం చేసుకుంది.;

Update: 2025-04-02 11:17 GMT

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం ఫుల్‌ జోష్‌ మీద ఉన్న విషయం తెల్సిందే. 2023లో యానిమల్‌, 2024లో పుష్ప 2, 2025లో ఛావా సినిమాలతో బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ విజయాలను సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలను తన ఖాతాలో వేసుకున్న రష్మిక మందన్న బర్త్‌డే రాబోతుంది. 29 ఏళ్ల వయసులో అడుగు పెట్టబోతున్న రష్మిక మందన్న గురించి సోషల్ మీడియాలో మరోసారి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్‌ 5వ తారీకున రష్మిక మందన్న పుట్టిన రోజు జరుపుకోబోతున్న విషయం తెల్సిందే. సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ తన పుట్టిన రోజును ప్రతి సంవత్సరం గ్రాండ్‌గా జరుపుకుంటూ ఉంది.


ఇటీవల ముంబైలోని ఒక రెస్టారెంట్‌లో విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్న కనిపించింది అంటూ కొందరు సోషల్‌ మీడియాలో చెబుతున్నారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలను సైతం కొందరు షేర్‌ చేస్తున్నారు. రష్మిక ఇటీవల సికిందర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సల్మాన్ ఖాన్ నటించిన ఆ సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్‌లో పాల్గొనడం కోసం రష్మిక మందన్న ముంబైలో ఉంది. గత వారం రోజులుగా ముంబైలో ఉన్న రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ కలిశాడని, వీరిద్దరు కలిసి రెస్టారెంట్‌కి వెళ్లారు అనేది గట్టిగా వినిపిస్తున్న పుకార్లు. రష్మిక బర్త్‌డే సందర్భంగా విజయ్ ముంబై వెళ్లి ఉంటాడని కొందరు అంటున్నారు.

రష్మిక మందన్న ముందస్తు బర్త్‌డే వేడుకల్లో భాగంగా విజయ్ దేవరకొండ అక్కడ పార్టీ ఇచ్చి ఉంటాడు అనేది కొందరి అభిప్రాయం. గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల రిలేషన్‌ గురించి పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెల్సందే. ఈ నేపథ్యంలో ముంబైలో వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఎవరైనా రష్మిక బర్త్‌డే ముందస్తు వేడుకలు అనుకుంటారు. నటిగా బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌లో బిజీ బిజీగా ఉన్న రష్మిక మందన్న తన బర్త్‌డే కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. బర్త్‌డే రాబోతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియాలో రష్మిక ఆసక్తికర పోస్ట్‌ను షేర్‌ చేసింది.

వయసు పెరిగినా కొద్ది పుట్టిన రోజు వేడుక పట్ల ఆసక్తి తగ్గుతూ ఉంటుందని అంటారు. కానీ నాకు మాత్రం అలా కాదు. ప్రతి సంవత్సరం నా బర్త్‌డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాను. గత ఏడాది కంటే ఈసారి ఇంకాస్త బెటర్‌గా బర్త్‌డే జరుపుకోవాలని అనుకుంటూ ఉంటాను. ఈసారి కూడా పుట్టిన రోజు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ పోస్ట్‌ చేసింది. రష్మిక పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. నిజంగానే ఒక వయసు వచ్చిన తర్వాత పుట్టిన రోజుపై ఆసక్తి తగ్గుతుంది. కానీ రష్మిక మాత్రం తన పుట్టిన రోజు విషయంలో చాలా ఆసక్తిని కలిగి ఉంటుంది. వచ్చే బర్త్‌డే వరకు రష్మిక జంటగా ఉండాలని, మూడు పదుల వయసులోకి జంటగా అడుగు పెట్టాలని రష్మికకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డేలు చెబుతున్న వారు చాలా మంది ఉన్నారు.

Tags:    

Similar News