'విరోష్' లవ్ స్టోరీ ట్విస్ట్.. 100 సార్లు అడిగితే గానీ..
తాను విజయ్ తో పెళ్లి విషయం ఎలా మాట్లాడిందో రష్మిక వివరించింది. 'మనం పెళ్లి చేసుకుందాం' అని తానే విజయ్ ను అడిగినట్లు చెప్పింది.
సినిమాల్లో ప్రేమకథలు చూసి అభిమానులు మురిసిపోతుంటారు. కానీ రియల్ లైఫ్స్ లో తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఒకరు ఏడాది పాటు అడుగుతూనే ఉన్నారంటే ఇంట్రెస్ట్ రాకమానదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ లవ్ స్టోరీ గురించి చెప్పిన ఓ విషయం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇన్నాళ్లూ విజయ్.. రష్మికకు ప్రపోజ్ చేసి ఉంటాడని అనుకుంటే, అసలు కథ మరోలా ఉందని తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత తొలిసారి కలిసి ఫేమస్ టాక్ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 9'lలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ తమ పెళ్లికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేశారు. ఆ ఎపిసోడ్ ప్రోమో బయటకు రావడంతో కన్వర్జేషన్స్ వైరల్ గా మారాయి.
షోలో విజయ్, రష్మికను పరిచయం చేస్తూ కరణ్ జోహార్ సరదాగా మాట్లాడారు. ఆ తర్వాత విజయ్ ను ఉద్దేశించి.. ఇంత అందమైన అమ్మాయి జీవితంలోకి వచ్చినప్పుడు ప్రపోజల్ ఏమైనా చేశావా అని అడిగారు. సాధారణంగా ప్రేమకథల్లో హీరో ప్రపోజ్ చేయడం మనం చూస్తుంటాం. కానీ వీరి విషయంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉందని రష్మిక మాటలతో అర్థమైంది.
తాను విజయ్ తో పెళ్లి విషయం ఎలా మాట్లాడిందో రష్మిక వివరించింది. 'మనం పెళ్లి చేసుకుందాం' అని తానే విజయ్ ను అడిగినట్లు చెప్పింది. అయితే, విజయ్ వెంటనే ఓకే చెప్పకుండా.. 'నువ్వు నన్ను వందసార్లు అడుగు' అన్నాడని రష్మిక చెప్పారు. ఆ మాట విన్న కరణ్ జోహార్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజంగానే వందసార్లు అడిగావా అని ఆమెను ప్రశ్నించారు.
దీనికి రష్మిక ఇచ్చిన ఆన్సర్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంది. తాను ఒక్కరోజో, రెండు రోజులపాటో అడగలేదని.. ఏకంగా ఏడాది పాటు పెళ్లి గురించి అడుగుతూనే ఉన్నానని చెప్పారు.. దీంతో విజయ్ తనదైన శైలిలో సరదాగా స్పందించారు. రష్మికే తనను వందసార్లు పెళ్లి చేసుకోమని అడిగిందని, అందుకే చివరకు సరేనన్నానని చెప్పాడు. తానేమీ అంత చెడ్డవాడిని కాదంటూ నవ్వులు పూయించాడు.
వీరి మాటల్లో ఫన్ కనిపించినా, అభిమానులకు మాత్రం ఆ విషయం కొత్తగా అనిపిస్తోంది. స్క్రీన్ పై లవర్స్ గా కనిపించిన విజయ్, రష్మిక నిజ జీవితంలోనూ ఒక్కటవ్వడం అభిమానులకు ఎప్పటి నుంచో ప్రత్యేకమే. ఇప్పుడు తమ మధ్య పెళ్లి ప్రస్తావన ఎలా వచ్చిందో చెప్పడంతో వారి ప్రేమకథపై ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. మ్యారేజ్ తర్వాత ఇలాంటి విషయాలను సరదాగా షేర్ చేసుకోవడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
అలా విజయ్ రష్మికకు గ్రాండ్ గా ప్రపోజ్ చేసి ఉంటాడని అనుకునే వారికి ఆ జంట చెప్పిన విషయం ఓ చిన్న ట్విస్ట్ అనే చెప్పాలి. పెళ్లి విషయంలో రష్మికే స్టెప్ వేసిందని, విజయ్ ను ఒప్పించడానికి ఏడాది పాటు ప్రయత్నించిందని తెలిసింది. ప్రేమకథల్లో ఎవరు ముందు అడిగారన్నది ముఖ్యం కాదని, ఇద్దరూ ఒక నిర్ణయానికి రావడమే ముఖ్యమని ఆ జంట మాటలు గుర్తు చేస్తున్నాయి.