విజయ్ దేవరకొండ అలాంటి సినిమా చేస్తే చూడాలని కోరుకుంటున్నారా?

నిజానికి విజయ్ దేవరకొండ రష్మిక మందాన కలిసి చేసిన 'గీతాగోవిందం' సినిమా అతని కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచింది.

Update: 2026-10-19 09:30 GMT

విజయ్ దేవరకొండ హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ రేంజ్ లో నిల్చోబెట్టాయి. అర్జున్ రెడ్డి లో వైవిధ్యమైన నటనను కనబర్చినందుకు చాలా మంది ప్రేక్షకులు ఆయన అభిమానులుగా మారిపోయారు. ప్రస్తుతం 'రణబాలి ' మూవీతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. రెగ్యూలర్ రొటీన్ ఫార్మాట్లో సినిమా కథలను ఎంపిక చేయడం విజయ్ కి నచ్చదు. రాబోయే రోజుల్లో కూడా వైవిధ్యాన్ని ప్రదర్శించే సినిమాలే చేస్తే బాగుంటుందని తన అభిమానులు భావిస్తున్నారు.

అలాంటి మూవీ చేస్తే బాగుంటుందా...

నిజానికి విజయ్ దేవరకొండ రష్మిక మందాన కలిసి చేసిన 'గీతాగోవిందం' సినిమా అతని కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచింది. విజయ్ ని 100 కోట్ల క్లబ్లో చేర్చిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం... ఈ సినిమాతో విజయ్ నటనలోని మరికొన్ని పరిచయం చేశాడు. ఇలాంటి సినిమా మళ్లీ చేస్తే విజయ్ తప్పకుండా సక్సెస్ అవుతాడని మరి కొంతమంది భావిస్తున్నారు. ఈ సినిమాలో హీరోను ఎలివేట్ చేసే సన్నివేశాలు గాని, భారీ ఫైటింగ్ సీన్స్ ఏమీ ఉండవు. మిడిల్ క్లాస్ కుర్రాడు ఎలాగైతే ఉంటాడో అలా విజయ్ మనకు కనిపిస్తాడు. దాంతో పాటుగా హీరోయిన్ ను మేడం, మేడం అనుకుంటూ ఆమె చుట్టూ తిరగడంలో అతని అమాయకత్వం మనకు నచ్చుతుంది. దీనివల్ల ఈ సినిమాని ప్రతి ఒక్కరు ఓన్ చేసుకుని సూపర్ సక్సెస్ గా నిలిపారు. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో కూడా విజయ్ ఇలాంటి సినిమా చేస్తే తప్పకుండా భారీ సక్సెస్ ని సాధిస్తారని తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందని మరి కొంతమంది భావిస్తున్నారు...

కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్

ఇండస్ట్రీలో చాలామంది యంగ్ డైరెక్టర్లు విజయ్ దేవరకొండతో సినిమాలు చేయడానికి కథలను రాసుకుంటున్నారు. ఎవరు ఎలాంటి కథ రాసిన కూడా విజయ్ దేవరకొండ ఇమేజ్ ని పెంచే విధంగానే రాస్తున్నారు. అలా కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను విజయ్ చేసినట్లయితే అతనికి చాలా మంచి క్రేజ్ వస్తుందని ఎంతసేపు మాస్ హీరో గా అవతరించాలనే ఆలోచిస్తున్నారు కానీ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల మీద ఎవరు ఫోకస్ చేయడం లేదు. విజయ్ అలాంటి కథలను ఎంచుకుంటే మాత్రమే తప్పకుండా సక్సెస్ సాధిస్తాడని మరి కొంతమంది సినీ విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు...

Tags:    

Similar News