గ్యాంగ్‌స్టర్ వార్నింగ్ : సల్మాన్‌తో పని చేస్తున్న వాళ్లంతా రిస్కులో ఉన్నారా?
``రామ్ రామ్ జీ.. అందరు అన్నలకూ, నేను అనిల్ పండిట్, లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడిని. ఈరోజు ముంబైలో టైగర్ ష్రాఫ్ పై జరిగిన దానికి బాధ్యత నేను (అనిల్ పండిట్)- మా పెద్ద అన్న అర్మాన్ సంధు తీసుకుంటున్నాము.
``రామ్ రామ్ జీ.. అందరు అన్నలకూ, నేను అనిల్ పండిట్, లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడిని. ఈరోజు ముంబైలో టైగర్ ష్రాఫ్ పై జరిగిన దానికి బాధ్యత నేను (అనిల్ పండిట్)- మా పెద్ద అన్న అర్మాన్ సంధు తీసుకుంటున్నాము.
మేము వీడికి సరిగ్గా అర్థమయ్యేలా చెప్పాము.. కానీ వీడికి అర్థం కాలేదు. ఇండస్ట్రీలో ఎవరైతే మాకు వ్యతిరేకంగా పని చేస్తారో లేదా సల్మాన్ ఖాన్‌తో కలిసి పని చేస్తారో, వాళ్ళని మేము చంపేస్తాము. ఇది మొదటి.. చివరి హెచ్చరిక.
ఈ సల్మాన్ ఖాన్ దావూద్‌కు కుక్కలా తయారయ్యాడు.. దావూద్ అనే కుక్కని మేము మా ఇంట్లో పెంచుకుంటున్నాము. సల్మాన్ ఖాన్ జాగ్రత్తగా విను.. ఒకవేళ నువ్వు మా పెద్దన్న లారెన్స్ బిష్ణోయ్ నుండి లేదా బిష్ణోయ్ సమాజం నుండి క్షమాపణ కోరకపోతే.. నీ ఇంట్లో కుక్కను కూడా వదలం.. మీ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేస్తాము. ఈ మాట మీ మైండ్‌లో పెట్టుకోండి``
పైన ఇచ్చిన వార్నింగ్‌ని సరిగ్గా చదివారా? లారెన్స్ బిష్ణోయ్ కి తమ్ముడిని అని చెప్పుకున్న గ్యాంగ్ సభ్యుడు అనీల్ పండిట్ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇది. ఈ వార్నింగ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన తీవ్రమైన హెచ్చరిక ఒకటి ఉంది. ``సల్మాన్ ఖాన్ తో ఎవరైతే కలిసి పని చేస్తారో.. వాళ్లను మేము చంపేస్తాము`` అంటూ ఈ స్ట్రైకింగ్ మాస్ వార్నింగ్ నిజానికి చాలా కంగారు పెట్టేదే.
నిజానికి సల్మాన్ ఖాన్ కేవలం బాలీవుడ్ దర్శకనిర్మాతలతో మాత్రమే కలిసి పని చేయడం లేదు. అతడు సౌత్ దర్శకులు, నిర్మాతలతోను, నటులతోను కలిసి పని చేస్తున్నాడు. దశాబ్ధాల కాలంగా ఇటు సౌతిండియాలో అతడి కనెక్షన్స్ చాలా ఎక్కువ. ఇక్కడ చాలా మంది దర్శకనిర్మాతలు, సంగీత దర్శకులు, ఆర్టిస్టులతో అతడు కలిసి పని చేసాడు. ఇప్పటికీ పని చేస్తున్నాడు. భారీ సినిమాల కోసం సౌత్ ట్యాలెంట్‌ని ఆహ్వానిస్తూనే ఉన్నాడు.
సరిగ్గా ఇలాంటి సమయంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఈ మాస్ వార్నింగ్ రావడం ఊహించని కలవరపాటు. నిజానికి సౌత్ ఫిలింమేకర్స్ ఒక ప్రతిభావంతుడైన ఆర్టిస్టును, మార్కెట్ స్టామినాను అంచనా వేసి అతడితో పని చేయడానికి భాష- ప్రాంతం అనే సరిహద్దులకు అతీతంగా ముందుకు వెళ్లేందుకు, కలిసి పని చేసేందుకు ఎప్పుడూ వెనకాడరు. అసలు వీళ్లకు గ్యాంగ్ స్టర్ లతో పనేంటి? వారితో వ్యతిరేకత ఏమిటి? అయినా ఇప్పుడు ఈ బిష్ణోయ్ గ్యాంగ్ మాస్ వార్నింగ్ ని ఏ కోణంలో చూడాలి.. అంటూ సౌత్‌లోనూ ఇప్పుడు చర్చ సాగుతోంది.
కన్నుకు కన్ను, ముక్కుకు ముక్కు, కాలుకు కాలు అన్న చందంగా ఈ గ్యాంగ్ స్టర్స్ ని ఏరి పారేస్తామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఇప్పుడు ఈ గ్యాంగ్ వార్ పరాకాష్ఠకు చేరబోతోంది. ఆర్థిక రాజధాని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇకపై గ్యాంగ్ స్టర్ కార్యకలాపాలపై తీవ్రంగా దృష్టి సారిస్తుండటంతో ముంబై అంతటా హై అలెర్ట్ నెలకొంది. టైగర్ ష్రాఫ్ పై ఎటాక్ తర్వాత హిందీ సినీప్రముఖులకు వై ప్లస్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసారు.