రామాయణ.. అనుకున్నట్లే 'ప్లాన్' అంతా సెట్!
ఎందుకంటే.. 2026లో ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూషన్ లో ఆయనకు అనుకున్న రేంజ్ లో రిజల్ట్స్ రాలేదు. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు నిరాశపరిచాయి.
ఒక భారీ సినిమా రైట్స్ దక్కించుకోవడం ఒక టాస్క్ అయితే.. ఆ మూవీతో మంచి లాభాలు పొందడం మరో పెద్ద టాస్క్. ఇప్పుడు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ముందున్న టార్గెట్ ఇదే. రణబీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న రామాయణ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసే బాధ్యతలను ఆయన తీసుకున్నారు. దీంతో ఆ సినిమాపై ఉన్న అంచనాలతో పాటు, దిల్ రాజు ప్లాన్ పై మళ్లీ చర్చ మొదలైంది.
నితేశ్ తివారీ దర్శకత్వంలో రామాయణ రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. మొదటి భాగాన్ని నవంబర్ 5న విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆ సినిమాను ఎస్వీసీ సంస్థ విడుదల చేయనుంది. ఆ విషయాన్ని రీసెంట్ గా మూవీ టీమ్ సోషల్ మీడియాలో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అయితే దిల్ రాజుకు ఆ మూవీ రిజల్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ గా మారింది.
ఎందుకంటే.. 2026లో ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూషన్ లో ఆయనకు అనుకున్న రేంజ్ లో రిజల్ట్స్ రాలేదు. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు రామాయణ వంటి బడా సినిమాపై ఫోకస్ పెట్టారు. అయితే థియేట్రికల్ రైట్స్ తీసుకున్నంత మాత్రాన లాభాలు వచ్చేస్తాయని చెప్పలేం. సినిమా ఎన్ని రోజులు బాగా ఆడుతుంది, ఎంత వసూలు చేస్తుందనే అంశాలే చివరికి రిజల్ట్ ను డిసైడ్ చేస్తాయి.
అదే సమయంలో ఆ మూవీ అగ్రిమెంట్ విషయంలో కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రచారంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం దిల్ రాజు రూ.54 కోట్ల రిటర్నబుల్ అడ్వాన్స్ పద్ధతిలో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అంటే ఆ ఒప్పందంలో పెట్టిన డబ్బు తిరిగి వచ్చేలా కొన్ని కండీషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, డిసైడ్ అయిన మొత్తానికి మించి వసూళ్లు వస్తే ఎక్స్ ట్రా ప్రాఫిట్స్ లో షేర్ తీసుకునే విధానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదు.
ఇక సినిమా మీద ఉన్న అంచనాలను యూజ్ చేసుకోవడంతోపాటు నష్టం రాకుండా చూసుకునేలా దిల్ రాజు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే రిటర్నబుల్ అడ్వాన్స్ అంటే అన్ని పరిస్థితుల్లోనూ నష్టం ఉండదని అనుకోవడం సరికాదు. అగ్రిమెంట్ లోని కండీషిన్ల బట్టి ఉంటుంది. కానీ రామాయణ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రామాయణ కథ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.
అందులోనూ సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తుండటం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. వీరితో పాటు రణబీర్ కపూర్ రాముడిగా ఎలా కనిపిస్తారనే ఇంట్రెస్ట్ ఉంది. ఆ స్త్రెంత్స్ తో దృష్టిలో పెట్టుకుని సినిమాను ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడం, ప్రేక్షకులకు చేరువ చేయడం దిల్ రాజు ప్లాన్ గా తెలుస్తోంది. అయితే అవే వసూళ్లు తీసుకొస్తాయని చెప్పలేం. సినిమా నచ్చితేనే అంచనాలు వసూళ్లుగా మారతాయి. మరి నవంబర్ 5న విడుదలయ్యాక దిల్ రాజు ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అయిందో తెలుస్తుంది.