సీక్వెల్ : ఏడాది కష్టం బూడిదలో పోసిన పన్నీరు!
2024లో మలయాళం నుంచి వచ్చిన 'ప్రేమలు' సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
2024లో మలయాళం నుంచి వచ్చిన 'ప్రేమలు' సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతా కొత్తవారే అయినా కంటెంట్ నచ్చి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మలయాళంలో కేవలం రూ.9 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ప్రేమలు సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.140 కోట్ల వసూళ్లు నమోదు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా ఓటీటీ, ఇతర రైట్స్ రూపంలోనూ నిర్మాత భారీ మొత్తంలో దక్కించుకున్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో ఒక సినిమా సూపర్ హిట్ అయితే వెంటనే సీక్వెల్‌ను ప్రకటిస్తున్నారు. ఈ సినిమాకు సైతం దర్శకుడు గిరీష్ ఏడీ సీక్వెల్‌ను ప్రకటించాడు. గత ఏడాది కాలంగా సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఒకపక్క తన సినిమాలు చేస్తూ, మరో వైపు ఈ సీక్వెల్ కోసం స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నట్లుగా మలయాళ మీడియాలో కథనాలు వచ్చాయి.
దర్శకుడు గిరీష్ ఏడీ దర్శకత్వంలో...
దర్శకుడు గిరీష్ ఏడీ దర్శకత్వంలో రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెత్లెహెం కుటుంబ యూనిట్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మలయాళంలోనే కాకుండా తెలుగు ఇంకా పలు భాషల్లో డబ్ అయ్యి మంచి వసూళ్లు నమోదు చేసింది. ప్రేమలు సినిమాతో హీరోయిన్గా మెప్పించిన మమిత బైజునే ఈ బెత్లెహెం కుటుంబ యూనిట్ సినిమాలో హీరోయిన్గా నటించి మెప్పించింది. దాంతో వీరి కాంబోలో మూడవ మూవీగా 'ప్రేమలు 2' రావడం ఖాయం అని అంతా భావించారు. ఇప్పటికే స్క్రిప్ట్ సైతం పూర్తి అయ్యి ఉంటుందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా దర్శకుడు గిరీష్ నుంచి షాకింగ్ ప్రకటన వచ్చింది. సీక్వెల్ రావడం లేదని, ప్రేమలు కు సరిపోయే సీక్వెల్ స్టోరీని రెడీ చేయలేక పోతున్నట్లు చెప్పడంతో సినీ ప్రేమికులు, ముఖ్యంగా మలయాళ సినీ ప్రేమికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా గిరీష్ పై కామెంట్స్ చేస్తున్నారు.
ప్రేమలు సీక్వెల్‌పై క్లారిటీ...
ప్రేమలు సీక్వెల్ స్క్రిప్ట్ కోసం దాదాపుగా ఏడాది కాలం కేటాయించామని, కానీ అనుకున్న విధంగా స్క్రిప్ట్ ను రెడీ చేయలేకపోయామని అన్నాడు. అంతే కాకుండా హిట్ సినిమాకు ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకుని సీక్వెల్‌ను చేయాలనే ఉద్దేశం లేదని కూడా ఈ సందర్భంగా గిరీష్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమలు సినిమాకు సీక్వెల్ లేదని స్వయంగా దర్శకుడు క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఇన్ని రోజులు చూసిన ఎదురుచూపులకు తెర పడినట్లు అయింది. ప్రేమలు కేవలం పదికోట్ల రూపాయల లోపు బడ్జెట్‌తో రూపొందిన విషయం తెల్సిందే. సీక్వెల్ ను సైతం మీడియం రేంజ్ బడ్జెట్‌తోనే తీసి మళ్లీ వంద కోట్లకు మించి వసూళ్లు రాబట్టుకోవాలని భావించారట. కానీ స్క్రిప్ట్ రెడీ కాకపోవడంతో దర్శకుడు గిరీష్ కొత్త ప్రాజెక్ట్ ను మొదలు పెట్టే యోచనతో ఉన్నట్లు మలయాళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
మమిత బైజు హీరోయిన్గా...
ప్రేమలు సినిమాను తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేయడం జరిగింది. ఒక మంచి ప్రేమ కథను వినోదాత్మకంగా అందించడంతో పాటు, ఈతరం యువత ఆలోచనకు తగ్గట్లుగా దర్శకుడు రూపొందించడం జరిగింది. అందుకే ప్రేమలు సినిమా వంద కోట్లకు మించిన వసూళ్లు రాబట్టింది. ఓటీటీలోనూ అంతకు మించి అన్నట్లుగా స్పందన లభించింది. సీక్వెల్ వచ్చి ఉంటే తప్పకుండా రూ.200 కోట్ల మూవీ అయ్యి ఉండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ దర్శకుడు గిరీష్ ఏడీ తీసుకున్న నిర్ణయంతో మొత్తం తలకిందులు అయింది. నిర్మాతలు చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూశారు, అంతే కాకుండా హీరోయిన్ మమిత బైజుతో పాటు ఇతర నటీనటులు సైతం మరో బిగ్ హిట్ పడే అవకాశం ఉందని భావించారు. ప్రేమలు సినిమాను ఇష్టపడే ప్రేక్షకులు ఇక సీక్వెల్ కోసం వెయిట్ చేయనక్కర్లేదు. ముందు ముందు కూడా సీక్వెల్ చేసే యోచన లేదని గిరీష్ చెబుతున్నాడు.