రజినీ 'జైలర్ 2'.. నాగవంశీ సేఫ్ జోన్ లోకి రావాలంటే..

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అందుకు చాలా సినిమాలు ఎగ్జాంపుల్స్ గా ఉండగా.. 'జైలర్' కూడా ఒకటి

Update: 2026-10-19 05:51 GMT

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అందుకు చాలా సినిమాలు ఎగ్జాంపుల్స్ గా ఉండగా.. 'జైలర్' కూడా ఒకటి. తక్కువ ధరకు హక్కులు సొంతం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్లకు ఆ సినిమా భారీ లాభాలను అందించింది. ఇప్పుడు సీక్వెల్‌ 'జైలర్ 2'పై విషయంలో పరిస్థితి వేరు. ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ ధరకు హక్కులు కొనుగోలు చేయడంతో నిర్మాత నాగవంశీ పెట్టుబడిని వెనక్కి రాబట్టుకుంటారా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

నాగవంశీ తెలుగు థియేట్రికల్ హక్కులను సుమారు రూ.42 కోట్లకు కొనుగోలు చేశారట! అయితే మొదటి నాలుగు రోజుల్లో వచ్చిన 'జైలర్ 2' వసూళ్లు చూస్తే సినిమా మంచి స్టార్టింగ్ అందుకున్నట్లు కనిపిస్తోంది. కానీ టార్గెట్ చేరుకోవడానికి ఇంకా కొంత దూరం ప్రయాణించాల్సి ఉంది. ఆదివారం వరకు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.27.50 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లు ఉన్నాయిలా!

నైజాం- రూ.11.80 కోట్లు

ఈస్ట్- రూ.1.85 కోట్లు

వెస్ట్- రూ.1.28 కోట్లు

గుంటూరు- రూ.2.08 కోట్లు

కృష్ణా- రూ.1.92 కోట్లు

నెల్లూరు- రూ.1.12 కోట్లు

వైజాగ్- రూ.3.15 కోట్లు

సీడెడ్-– రూ.4.30 కోట్లు

మొత్తం షేర్-– రూ.27.50 కోట్లు

ఆ లెక్కన చూస్తే థియేట్రికల్ బిజినెస్‌ లో దాదాపు 66 శాతం వరకు వెనక్కి రాబట్టింది. అంటే పెట్టుబడిని పూర్తిగా రికవరీ చేసుకోవడానికి ఇంకా రూ.14.50 కోట్ల షేర్ అవసరం. మొదటి నాలుగు రోజుల్లోనే ఆ రేంజ్ వసూళ్లు రావడం మంచి విషయమే. అయితే మిగిలిన మొత్తాన్ని రాబట్టడానికి వచ్చే రోజుల్లోనూ థియేటర్లకు ప్రేక్షకులు వస్తుండాలి. సాధారణంగా బడా సినిమాలకు ఫస్ట్ వీకెండ్ లో మంచి వసూళ్లు వస్తాయి.

సెలవులు కంప్లీట్ అయ్యి వర్కింగ్ డేస్ మొదలైన తర్వాత కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటేనే సినిమా బాక్సాఫీస్ జర్నీ ఎలా ఉండబోతోందో అర్థమవుతుంది. 'జైలర్ 2' విషయంలోనూ ఇప్పుడు ఇదే మెయిన్. తొలి నాలుగు రోజుల్లో వచ్చిన వసూళ్లను కొనసాగిస్తూ, రూ.14.50 కోట్ల షేర్‌ రాబట్టగలిగితే నాగవంశీ సేఫ్ జోన్‌ లోకి వచ్చినట్లేనని చెప్పాలి.

2023లో విడుదలైన 'జైలర్' తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.47.90 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అప్పట్లో తెలుగు హక్కులు దాదాపు రూ.12 కోట్లకు అమ్ముడవడంతో డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు వచ్చాయి. ఆ విజయం రజినీకాంత్ సినిమాలకు తెలుగులో ఉన్న మార్కెట్‌ పై నమ్మకాన్ని పెంచింది. దీంతో రెండో భాగానికి హక్కుల ధర కూడా పెరిగింది.

అయితే ఫస్ట్ పార్ట్ వసూళ్లను రెండో భాగంతో పోల్చలేం. ఈసారి పెట్టుబడి ఎక్కువగా ఉండటంతో లాభాలు రావాలంటే మరిన్ని వసూళ్లు అవసరం. తొలి నాలుగు రోజుల్లో వచ్చిన రూ.27.50 కోట్ల షేర్ ఆశలు పెంచుతున్నా, మిగిలిన మొత్తాన్ని రాబట్టుకోవడం ముఖ్యం. వీకెండ్, హాలీడేస్ తర్వాత కూడా సినిమా స్టేబుల్ గా వసూళ్లు సాధిస్తుందా, నాగవంశీ పెట్టుబడిని పూర్తిగా వెనక్కి తెస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

Tags:    

Similar News