జెన్ జీ టార్గెట్ గా కల్ట్.. స్టోరీ రివీల్ చేసిన విశ్వక్ సేన్!
ప్రతి ఒక్కరిని క్యాటగరైజ్ చేసుకుని తీసిన సినిమా కాదు. నాకు క్లియర్ విజన్ ఉంది . నేను కచ్చితంగా యువతను, జెన్ జీ ను టార్గెట్ గా చేసుకొని ఈ కల్ట్ సినిమా తెరకెక్కిస్తున్నాను.
సాధారణంగా ఒక సినిమా తెరకెక్కుతోంది అంటే కచ్చితంగా సినిమా అందరూ చూడాలి. అప్పుడే నిర్మాతకు డబ్బులు వస్తాయి.. అయితే కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకొని సినిమాలు చేస్తూ కోట్లు కొల్లగొడుతుంటే.. మరి కొంతమంది మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు. అయితే ఇక్కడ తాను కూడా ఇందుకు అతీతం కాదు అని, తాను ప్రత్యేకించి జెన్జీ యువతను టార్గెట్ గా చేసుకొని సినిమా చేశాను అంటూ స్పష్టంగా వివరణ ఇచ్చారు విశ్వక్ సేన్ .. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఫలక్నుమా దాస్ సినిమా తర్వాత అంతే కసితో కోపంతో తీస్తున్న చిత్రం కల్ట్ అని చెప్పిన విశ్వక్ సేన్.. అసలు ఈ సినిమా ఎవరిని టార్గెట్ గా చేసుకొని చేస్తున్నారు అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు. అసలు విషయంలోకి వెళ్తే.. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, నటుడిగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం కల్ట్. ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. "జెన్ జీ ను టార్గెట్ గా చేసుకొని తీసిన సినిమా కల్ట్. ఇది ప్రతి ఒక్కరి కోసం తీసిన సినిమా కాదు.. ఈ విషయం నాకు స్పష్టంగా తెలుసు.
ప్రతి ఒక్కరిని క్యాటగరైజ్ చేసుకుని తీసిన సినిమా కాదు. నాకు క్లియర్ విజన్ ఉంది . నేను కచ్చితంగా యువతను, జెన్ జీ ను టార్గెట్ గా చేసుకొని ఈ కల్ట్ సినిమా తెరకెక్కిస్తున్నాను. ముఖ్యంగా ప్రాజెక్టు ఎక్స్, స్క్విడ్ గేమ్ కలిస్తే కల్ట్. ఈ రెండు నా ఫేవరెట్ చిత్రాలు.. ఈ రెండు చిత్రాలను కలిపి తీసిన సినిమానే కల్ట్. గోవాలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు.. నేను చాలా బాధపడ్డాను.. అక్కడ ఇద్దరు తెలుగు వాళ్ళను కొట్టి చంపేశారు. ముఖ్యంగా ఆ అంశం నన్ను మరింతగా ఆలోచింపజేసింది. ఆ తర్వాత కూడా గోవాలో నాన్ లోకల్ వాళ్లను ఎలా ట్రీట్ చేస్తారో చాలామందికి తెలుసు. నేను ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు మధ్యలో నాకు ఈ సంఘటన మరింత కలిచి వేసింది.
ఈ సినిమాలో నేనొక పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాను. హైదరాబాదులో ఒక పోలీసు ఉంటాడు. మధ్యలో ఈ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఆట మరో లెవెల్ కి వెళ్తుంది. ఈ డిఎస్పి సంకల్ప నాయక్ (విశ్వక్ సేన్) అనే వ్యక్తి హైదరాబాదు నుండి కావాలని గోవా కి పోస్టింగ్ తీసుకొని వెళ్తాడు. నాన్ లోకల్ ను ఎవరైనా కొడితే.. ఈ డిఎస్పి వాళ్ళని కొడుతూ ఉంటాడు. స్టెరాయిడ్స్ తీసుకున్న వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో అలా.. ఇదే ఈ సినిమా.. అంటూ స్టోరీ కూడా రివీల్ చేశారు విశ్వక్ సేన్. చాలా క్లియర్ గా యువత, జెన్ జీ కోసమే ఈ మూవీ చేశానని, ఆయన క్లారిటీ ఇవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే ఇంతకు ముందు విడుదల చేసిన టీజర్ లో స్టోరీ గురించి చెబితే.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో చూపించిన రక్తపాతం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా సెన్సార్ హద్దులను మీరుతూ ఆర్.రేటెడ్ మూవీగా టాలీవుడ్ లో తెరకెక్కుతోందంటూ చెబుతున్న ఈ సినిమా అసలు జెన్ జీను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.