'డ్రాగన్' రామోజీ ఫిల్మ్ సిటీలో ఏం చేస్తున్నాడు?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ 'డ్రాగన్'. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న కారణంగా అంచనాలు భారీగా పెరిగాయి.
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ 'డ్రాగన్'. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న కారణంగా అంచనాలు భారీగా పెరిగాయి. కేజీఎఫ్ ప్రాంచైజీ, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో యాక్షన్ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడం ఖాయం అని ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు ఎంతో నమ్మకంగా ఉన్నారు. వీరి కాంబో మూవీ చాలా ఏళ్ల క్రితం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ మధ్యలో అనివార్య కారణాల వల్ల ప్రశాంత్ నీల్ వేరే ప్రాజెక్ట్‌ను చేయాల్సి వచ్చింది. ఎన్టీఆర్ సైతం ముందుగా కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయడానికి ఈ సమయం పట్టింది. ఎట్టకేలకు డ్రాగన్ ప్రారంభం అయిందని ఫ్యాన్స్ భావిస్తూ ఉంటే ఏవో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి.
దర్శకుడు ప్రశాంత్ నీల్ డ్రాగన్...
ఈ ఏడాది ఆరంభంలోనే సినిమా విడుదల చేసే విధంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ షూటింగ్ మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడం, ఆ తర్వాత ఎన్టీఆర్ చేతికి గాయం కావడం వంటి కారణాల వల్ల ఇప్పటికీ షూటింగ్ జరుగుతూనే ఉంది. వచ్చే ఏడాదిలో సినిమా షూటింగ్ ను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న డ్రాగన్ సినిమా మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్న సమయంలో ఎట్టకేలకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ సందడి మొదలైంది. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని ఎన్టీఆర్ మరీ ఆలస్యం చేయడం ఇష్టం లేక షూటింగ్‌కు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఎన్టీఆర్ మరియు కీలక నటీనటుల సమక్షంలో కీలక సన్నివేశాల షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో ఒక యాక్షన్ సీన్‌తో పాటు, పాటను సైతం చిత్రీకరిస్తారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ డ్రాగన్ అప్డేట్...
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఒక భారీ సెట్లో కీలకమైన యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. మరోవైపు పాట కోసం భారీ సెట్ నిర్మాణం పక్కనే జరుగుతుందని చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. డ్రాగన్ ప్రస్తుతానికి యాక్షన్ చేసి, ఆ వెంటనే పాటలో జాయిన్ కానున్నాడు. ఈ షెడ్యూల్‌తో సినిమాకు సంబంధించిన కీలకమైన సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్స్ షూట్ పూర్తి అవుతాయని తెలుస్తోంది. విదేశాల్లోనూ ఒక షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ప్రశాంత్ నీల్ మూవీస్ విదేశాల్లో షూటింగ్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో ఉంటుందా లేదా అనే విషయంలో క్లారిటీ రావలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి అయితే నెలల తరబడి వాయిదా వేస్తూ వస్తున్న డ్రాగన్ షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో పునః ప్రారంభం కావడం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తుంది అనడంలో సందేహం లేదు.
ఎన్టీఆర్‌కి జోడీగా రుక్మిణీ వసంత్...
ఎన్టీఆర్ ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాడు అనేది ఇప్పటికే రివీల్ చేయడం జరిగింది. ప్రశాంత్ నీల్ తన గత చిత్రాల్లో హీరోను ఎలా అయితే చూపించాడో అదే తరహాలో ఈ సినిమాలోనూ ఎన్టీఆర్‌ను అలాగే చూపించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణీ వసంత్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి మూవీస్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ డ్రామాను 2027 సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే పట్టుదలతో దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాతలు ఉన్నారు. ఎన్టీఆర్ గాయం నుంచి కోలుకున్న కారణంగా ఇక జెట్ స్పీడ్‌తో సినిమాను పూర్తి చేసి, అనుకున్న సమయంకు విడుదల చేసే అవకాశౄలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.