వార‌సుడి సినిమాలో సింహం ఓ మెరుపులా!

మోక్షజ్ఞ తొలి సినిమా కావడంతో ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు వశిష్ట ప్రత్యేక కసరత్తులు చేస్తున్నారు.

Update: 2026-10-19 11:30 GMT

యంగ్ డైరెక్టర్ మ‌ల్లిడి వశిష్ట దర్శకత్వంలో నంద‌మూరి వార‌సుడు మోక్షజ్ఞ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది దర్శకుల పేర్లు పరిశీలనలోకి వ‌చ్చినా? చివరికి `బింబిసార` ఫేం వశిష్ట వైపు నందమూరి బాలకృష్ణ మొగ్గు చూపారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై నందమూరి అభిమానుల్లో.. సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మోక్షజ్ఞ తొలి సినిమా కావడంతో ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు వశిష్ట ప్రత్యేక కసరత్తులు చేస్తున్నారు. కథా చర్చల దగ్గరి నుంచి ప్రతీ విషయంలోనూ బాలయ్య స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే మోక్షజ్ఞ లాంచ్ పర్ఫెక్ట్‌గా ఉండాలనే ఉద్దేశంతో సినిమాలో బాలకృష్ణ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారనే వార్త ఫిలింనగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ గెస్ట్ రోల్ కేవలం సినిమాకు ఒక పవర్ ప్యాక్డ్ టేకాఫ్ లాగా మాత్రమే ఉంటుందని తెలుస్తోంది.

సాధారణంగా స్టార్ హీరో వారసుడి లాంచ్ సినిమాలో కనిపిస్తే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అయితే స్క్రీన్ మీద బాలకృష్ణే ఎక్కువ సేపు కనిపిస్తే? అది డెబ్యూ హీరో అయిన మోక్షజ్ఞకు మైనస్‌గా మారుతుందనే జాగ్రత్తను వశిష్ట ముందుగానే ప్లాన్ చేసినట్లు సమాచారం. సీనియర్ హీరో స్థాయికి తగినట్లుగా సినిమా మొత్తం ఉంటే? కొత్త హీరో ఎలివేషన్ తగ్గే ప్రమాదం ఉందని భావించిన దర్శకుడు బాలయ్య పాత్రను కేవలం ఒక మెరుపులా.. సరిగ్గా ఇంట్రడక్షన్ కీలకమైన టేకాఫ్ సన్నివేశాలకే పరిమితం చేయాలని నిర్ణయించుకున్నారట.

ఈ గెస్ట్ రోల్ ద్వారా సినిమాకు కావాల్సినంత హైప్ రావడం ఖాయమని.. అదే సమయంలో మోక్షజ్ఞకు పూర్తి స్థాయి హీరోగా ప్రతిభను ప్రదర్శించడానికి తగినంత స్పేస్ దొరుకుతుందని తెలుస్తోంది. నందమూరి అభిమానుల అంచనాలను నిలబెడుతూనే మోక్షజ్ఞ సోలో హీరోగా టాలెంట్‌ను నిరూపించుకోవడానికి ఈ ప్లానింగ్ ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారుట‌.

నందమూరి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మోక్షజ్ఞ మీద ఉండటంతో ఆయన మేకోవర్, డ్యాన్సులు, యాక్షన్ సీక్వెన్స్‌ల విషయంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించినట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభం నుండి ఎంతో పకడ్బందీగా స్క్రిప్ట్ వర్క్ జరుపుకున్న ప్రాజెక్ట్ పై అంచనాలు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. బాలయ్య ఇచ్చే ఆ చిన్న మెరుపు సినిమాకు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని..ఆ త‌ర్వాత‌ సినిమాను పూర్తిగా మోక్షజ్ఞ తన భుజాలపై మోస్తారని తెలుస్తోంది.

మొత్తానికి వారసుడి ఎంట్రీని ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా వ్యూహాత్మకంగా నందమూరి కాంపౌండ్ ప్లాన్ చేస్తోంది. బాలయ్య కేవలం టేకాఫ్ లాంటి గెస్ట్ రోల్‌తో ఆశీర్వదించి.. పూర్తి బాధ్యతను మోక్షజ్ఞ భుజస్కంధాలపై పెట్టడం ప్రాజెక్ట్ పై ఉన్న సీరియస్‌నెస్‌ను తెలియజేస్తోంది. వశిష్ట టేకింగ్‌లో మోక్షజ్ఞ తెరపై ఎలా అదరగొడతారో చూడాలని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్ర‌చారానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News