వైరల్ స్టంట్స్ వీడియో.. అందులో ఉన్నది దేవరకొండనా..?

ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా కింగ్ డమ్ కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ఆయన ఫుల్ డెడికేషన్ పెట్టి పని చేశారట.;

Update: 2025-07-18 08:14 GMT

సినిమాలో నటన, డ్యాన్స్, స్టంట్స్, రొమాన్స్ ఇలా ప్రతీదీ పర్ఫెక్ట్ గా చేసినప్పపడే హీరోకు సంపూర్ణ అర్థం. ఒక సినిమాకు హీరో ఎంతో కష్టపడితే ఔట్ పుట్ సరిగ్గా వస్తుంది. ఇందులో రొమాన్స్ ఉండొచ్చు, యాక్టింగ్ ఉండొచ్చు, డ్యాన్స్ అండ్ స్టంట్స్ ఉండొచ్చు. ఏ ఒక్కడి సరిగ్గా చేయకపోయినా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా కింగ్ డమ్ కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ఆయన ఫుల్ డెడికేషన్ పెట్టి పని చేశారట. చాలా ఏళ్లుగా హిట్ లేక సతమతమవుతున్న విజయ్ ఈ సినిమా కోసం తీవ్రంగా శ్రమించారు. ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారట. ఎలాగైన ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నారు.

అయితే కింగ్ డమ్ కోసం విజయ్ చాలా కష్టపడ్డారని తెలియగానే, తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. విజయ్ స్టంట్ వీడియో అంటూ వీడియో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఉన్న వ్యక్తి చేతుల సాయం లేకుండా కాళ్లతోనే రెండు గోడల మధ్య జంప్ చేస్తూ పైకి ఎక్కాడు. ఈ గోడల ఎత్తు దాదాపు 12 ఫీట్లు ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక పైకి చేరుకున్నాక, అటువైపు గోడ నుంచి వెనక్కి ఉన్న బిల్డింగ్ పైకి దూకాడు.

చేతులతో తాకకుండా చకచకా గోడను సులువుగా ఎక్కి అతడు చేసిన స్టంట్స్ హాలీవుడ్ సినిమా విజువల్స్ ను తలపిస్తుంది. విజయ్ నిజంగా ఫుల్ డెడికేషన్ త ఈ సినిమా కోసం కష్టపడ్డారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో ఉన్న వ్యక్తి విజయ్ కాదని తెలుస్తోంది. చూసేందుకు అచ్చం విజయ్ లాగే ఉండడంతో అది రౌడీ బాయ్ అని అవి కింగ్ డమ్ సినిమా కోసం చేసిన స్టంట్స్ అని పోస్ట్ లు వైరల్ అయ్యాయి. కానీ, అది మాత్రం విజయ్ కాదు.

అయితే ఆ వీడియో ఎక్కడిది, అందుకో స్టంట్స్ చేసింది ఎవరో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. మరి మీరూ ఈ వీడియో చూసేయండి. కాగా, ఈ సినిమాను యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించారు. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు.

Tags:    

Similar News